Home
పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.
ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.
ఈ ఆరోగ్య సందేశాలను ఆరోగ్య కార్యకర్తలు, వైద్య నిపుణులు తయారుచేసి, సమీక్షించారు. వీటిని సందేశం అర్థం మారకుండా వేరే భాషలోకి అనువదించవచ్చు మరియు వాడవచ్చు. ఆరోగ్య సందేశాలు సరిగ్గా,తప్పుల్లేకుండా ఉన్నాయని,ఆ సమయానికి తగ్గట్టుగా ఉన్నాయని జాగ్రత్తగా నిర్థారించుకోవాలి.ఆరోగ్య కార్యకర్తలు ఈ ఆరోగ్య సందేశాలను తమ తరగతి గదుల్లో, ప్రాజెక్టుల్లో, చర్చలను పెంచటం కోసం, ఇతర పనుల కోసం తమ విద్యా శిక్షణ , అభ్యాసాలలో వాడుకుంటారు.
ఉదాహరణకి, చేతులు సరిగ్గా కడుక్కోటం గురించి సందేశం చదివి నేర్చుకున్నాక, పిల్లలు వారి కుటుంబాలలో, ‘మన ఇంట్లో,చుట్టుపక్కలా చేతులు సరిగ్గా కడుక్కోకపోవటానికి అంత ఇబ్బందిపడే కారణాలు ఏంటి?’ అని అడుగుతారు.ఈ సమస్య గురించి మాట్లాడే పిల్లలు, ఎలా వారి చుట్టూ సమస్యలని పరిష్కరించవచ్చని నిర్ణయాలు తీసుకునే పిల్లలు మార్పుకి కారణమవుతారు, అదే ఈ ఆరోగ్య సందేశం నేర్చుకోవటం వెనక ఉన్న విలువ అదే. ఈ సందేశం చర్చకి, మార్పుకి ఒక తలుపుగా మారుతుంది.
తల్లిదండ్రులు లేదా టీచర్లు పిల్లలని ఈ ఆరోగ్య సందేశాలను కంఠస్థం చేసి, గుర్తుపెట్టుకోమనచ్చు. లేదా పిల్లలు ప్రతి ఆరోగ్య సందేశానికి సంబంధించి ఏమన్నా పనులు, అభ్యాసాలు సృష్టించుకుని వాటి సాయంతో సందేశాలను గుర్తుపెట్టుకోవచ్చు. ఇవి నేర్చుకుని మరియు ఇతరులతో ఈ సందేశం పంచుకున్న పిల్లలకి చిన్న చిన్న బహుమతులను ఇవ్వవచ్చు. ఉదాహరణకి రిబ్బను లేదా రంగురంగుల గుడ్డలను బహుమతులుగా ఇవ్వవచ్చు. పిల్లలు ఈ గుడ్డలను కర్రముక్కలకి కట్టి రంగురంగుల ఇంద్రధనస్సు కర్రగా తిప్పుతూ, వారు నేర్చుకున్న, పంచుకున్న సందేశాలను అందరికీ చూపించవచ్చు.
నేర్చుకోడానికి మరియు ఇతరులతో పంచుకోటానికి పిల్లల కోసం ఈ 100 సందేశాలను తయారుచేసినది, యూకెలోని కేంబ్రిడ్జ్ లోని ఒక చిన్న ఎన్జీవో అయిన చిల్డ్రన్ ఫర్ హెల్త్. చిల్డ్రన్ ఫర్ హెల్త్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్యవిద్య భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది.
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు: www.health-orb.org (టాపిక్ పేజీ)
1
1. పసిపిల్లల సంరక్షణ (Telugu, Caring for Babies & Young Children)
- మీకు ఎంత వీలైతే అంత పసిపిల్లలతో ఆటలు ఆడండి, హత్తుకోని ఉండండి, మాట్లాడండి, నవ్వండి ఇంకా వారికి పాటలు పాడి విన్పించండి.
- పసిపిల్లలు, పాపాయిలు సులభంగా కోపం తెచ్చుకుంటారు,భయపడతారు, ఏడుస్తారు ఇంకా వారికి ఏం అన్పిస్తుందో కూడా చెప్పలేరు. అందుకని చిరాకు తెచ్చుకోకండి. ఎప్పుడూ ప్రేమగా ఉండండి.
- పసిపిల్లలు వేగంగా నేర్చుకుంటారు ;ఎలా నడవాలి, శబ్దాలు చేయటం, తినడం, తాగడం. వారికి సాయం చేస్తూనే సురక్షితమైన పొరపాట్లను కూడా చేయనివ్వండి!
- అమ్మాయిలు,అబ్బాయిలు అందరూ ముఖ్యమే. అందర్నీ ఒకేలాగా, ముఖ్యంగా జబ్బు చేసిన పిల్లలను, వికలాంగులైన పిల్లలను ఒకేలాగా చక్కగా చూడండి.
- పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని అన్నిటిలో అనుకరిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి, వారి దగ్గర సరిగ్గా ప్రవర్తించి, వారికి మంచిమార్గాలు చూపించండి.
- పసిపిల్లలు ఏడ్చినప్పుడు తప్పక ఏదో ఒక కారణం ఉంటుంది (ఆకలి,భయం, నొప్పి). అది ఎందుకో కనుక్కోండి.
- పసిపిల్లలను అంకెలు, పదాల ఆటలు, పెయింటింగ్, బొమ్మలు వేయించటంలాంటివి ఆడించి వారిని బడికి సిద్ధం చేయండి. వారికి కథలు చెప్పండి, పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి.
- ఒకచోట గ్రూపులాగా, ఒక నోటు పుస్తకంలో పాపాయి, పసిపిల్లలుగా ఎలా ఎదుగుతున్నారో చూస్తూ అందులో రికార్డు చేయండి. వారు చేసిన ‘మొదటి’పనులు మాట్లాడటం, నడవటం వంటివి.
- పెద్దవారైన సంరక్షకులు, పెద్దపిల్లలకి సాయం చేస్తూ పసిపిల్లలు,పిల్లలు శుభ్రంగా ఉండేలా చేయండి(ముఖ్యంగా చేతులు,మొహాలు),సురక్షితమైన నీళ్ళు తాగేలా, సరిపోయేంత మంచి ఆహారం తినేలా చేసి వ్యాధులు రాకుండా అరికట్టండి.
- పసిపిల్లలకి, పిల్లలకి కావాల్సినంత ప్రేమ, ఆప్యాయత పంచండి కానీ మీ గురించి మర్చిపోకండి. మీరు కూడా ముఖ్యమే.
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
పసిపిల్లల సంరక్షణ ; పిల్లలు ఏం చేయగలరు?
- మీ సొంత పదాల్లో, మీ భాషలో పసిపిల్లల సంరక్షణ గురించిన సందేశాలను తయారుచేసుకోండి!
- ఈ సందేశాలను మర్చిపోకుండా చదువుకుని గుర్తుంచుకోండి!
- ఈ సందేశాలను ఇతర పిల్లలు, మన కుటుంబాలలో కూడా అందరికీ తెలియచేయండి!
- అబ్బాయిలు, అమ్మాయిలు అని రెండు గ్రూపులుగా విడగొట్టండి; అబ్బాయిలను ‘అమ్మాయిల ఆటలు’, అమ్మాయిలు ‘అబ్బాయిల ఆటలు’ ఆడేలా చూడండి. తర్వాత రెండు గ్రూపులు కలసి కూర్చుని ఈ ఆటల గురించి చర్చించండి. ఉదాహరణకి, కొన్ని ఆటలను ‘అబ్బాయిల లేదా అమ్మాయిల ఆటలు’ అని పిలవటం మీకు నచ్చుతుందా?ఒప్పుకుంటారా? అయితే ఎందుకు?కాకపోతే ఎందుకు కాదు?
- ఇంట్లో కానీ, స్కూలులో కానీ ‘మంచి’ లేదా ‘చెడ్డ’ ప్రవర్తన అంటే ఏంటో,వాటిని అలా ఎందుకు అంటారో చర్చించండి.
- మనకి ఈ అంశం గురించి తెలిసినది ఇతరులకి చూపించటానికి పోస్టర్లు తయారుచేయండి.
- ఇంట్లో,స్కూలులో లేదా కమ్యూనిటీ గ్రూపుల్లో – బొమ్మలను తయారుచేసే పోటీలు నిర్వహించండి, మొబైల్స్, బిల్డింగ్ బ్లాక్స్ తో, నిజం బొమ్మలు, జంతువులు, చిత్రపుస్తకాలు ఏవైనా.
- సబ్బుతో చేతులు కడుక్కోవటం, రోగనిరోధక వ్యాక్సిన్లు, సమతుల ఆహారం తీసుకోవటం వంటి రోగనివారణకి సింపుల్ పద్ధతులను సూచించే పోస్టర్లను, బొమ్మలనూ గీయండి.
- చిన్నపిల్లలతో కలిసి ఆడుకునే సంరక్షకులపై చిన్న నాటిక తయారుచేయండి. ఇద్దరు తల్లుల మధ్య సంభాషణగా రాయవచ్చు ; ఒకరు పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలనుకునేవారు, మరొకరు పిల్లలన్నాక ఆడుకోవాలి అనుకునేవారు! చేతులతో, ముఖంలో భావాలతో శబ్దంలేకుండా, మాట్లాడకుండా అన్ని డైలాగులు నటింపచేయండి. మిగతా పిల్లలని ఆ భావం లేదా విషయాన్ని గెస్ చేయమనండి.
- తల్లిదండ్రులని, అమ్మమ్మ/నానమ్మ –తాతయ్యలని పిల్లలు ఎందుకు ఏడుస్తారు,నవ్వుతారని అడగండి. ఏం తెలుసుకున్నారో క్లాసులో పంచుకోండి.
- ఒక క్లాసు లేదా బృందం స్థానిక ప్రదేశంలో ఉన్న ఒక బేబీని దత్తత తీసుకోవచ్చు. ఆ పాప/బాబు తల్లి ప్రతి నెలా క్లాసు లేదా బృందాన్ని కలిసి తన బేబీ ఎలా పెరుగుతోందో వివరించవచ్చు.
- పరిశుభ్రంగా ఉండటం, మంచి నీరు తాగటం ద్వారా వ్యాధులను నివారించే సింపుల్ స్టెప్స్ ను వివరించే పాటలను రూపొందించండి, వాటిని ఇంట్లో మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళతో కలిసి పాడండి.
- పెద్ద పిల్లలు తల్లిదండ్రులను వారి పిల్లలను సంరక్షించటంలో, బాగా చూసుకోటంలో కష్టాలు ఏమిటి, ఏది అన్నిటికన్నా ఎక్కువ సాయపడిందని అడగండి.
- హెల్త్ వర్కర్ లేదా సైన్స్ ఉపాధ్యాయుడుని బేబీ మెదడు ఎలా పెరుగుతుందో ఇంకా చెప్పమని అడగండి.
- పెద్ద పిల్లలు తమ ఇంట్లో, చుట్టుపక్కల ముసలివారిని వారికి పాటలు,కథలు, ఆటలు నేర్పించమని అడగవచ్చు. చెల్లెళ్ళకి లేదా తమ్ముళ్ళకి, చిన్నబేబీలకి పాటలు పాడి వినిపించవచ్చు.
- పిల్లలు పెద్దవారిని బేబీలను వివిధ వ్యాధులు రాకుండా సంరక్షించటం ఎందుకు ముఖ్యమో అడగవచ్చు.
మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.
2
2. దగ్గు, జలుబులు మరియు జబ్బులు (Telugu, Coughs, Colds & Pneumonia)
- కట్టెలతో వంట చేసినప్పుడు వచ్చే పొగలో రేణువులు కొన్ని ఊపిరితిత్తులలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.బయట వండవద్దు లేదా తాజా గాలి వచ్చేచోట చేస్తే పొగ గాలిలో కలిసిపోతుంది.
- పొగాకు పొగతాగడం వలన ఊపిరితిత్తులు బలహీనంగా మారుతాయి. ఇంకొకళ్ళు పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చినా మీకు అపాయకరమే.
- ప్రతి ఒక్కరికీ దగ్గు, జలుబులు వస్తాయి. చాలామందికి అవంతట అవే తగ్గిపోతాయి. మూడు వారాల కన్నా ఎక్కువ దగ్గు లేదా జలుబు ఉంటే హెల్త్ క్లినిక్ కి వెళ్ళండి.
- సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, వైరస్ లని రెండు రకాలు ఉంటాయి. వైరస్ ల వలనే దగ్గు, జలుబులు వస్తాయి, ఇవి మందులతో చంపబడవు.
- శరీరంలో శ్వాస పీల్చుకునే అవయవాలు ఊపిరితిత్తులు. దగ్గు,జలుబులు ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి.న్యుమోనియా అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా బలహీనమైన ఊపిరితిత్తులలో తీవ్ర జబ్బును కలిగిస్తాయి.
- న్యుమోనియా(తీవ్రమైన జబ్బు)లో ఒక లక్షణం వేగంగా శ్వాస తీసుకోవటం. అందుకని మీ శ్వాసను శ్రద్ధగా పరిశీలించండి. ఛాతీ పైకి, కిందకి వెళ్ళటం చూడండి. ఇతర లక్షణాలు జ్వరం, ఒంట్లో బాలేకపోవటం, ఛాతీ నొప్పి.
- 2 నెలల వయస్సు కన్నా తక్కువ ఉండే పసిపిల్లలు నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటుంటే , తప్పనిసరిగా వేగంగా హెల్త్ వర్కర్ దగ్గరకు తీసుకెళ్ళాలి! 1-5 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో 20-30 సార్లు నిమిషానికి శ్వాస ఉంటే అది వేగవంతమైన శ్వాస అని అర్థం.
- మంచి ఆహారం (తల్లిపాలు తాగే బేబీలకి కూడా), పొగ తాగని, రాని ఇళ్ళు, సరైన టీకాలు న్యుమోనియా లాంటి తీవ్ర జబ్బులను నివారిస్తాయి.
- దగ్గు లేదా జలుబును తరచూ వేడిగా ఉండే, రుచికరమైన డ్రింక్స్ (సూప్ ఇంకా జ్యూస్)తాగుతూ, విశ్రాంతి తీసుకోడం, ముక్కును శుభ్రంగా ఉంచుకుంటూ నయం చేయండి.
- దగ్గు, జలుబులు, ఇతర వ్యాధులను ఒకరినుంచి మరొకరికి అంటుకునేలా చేయటం ఆపండి. చేతులు, తినే, తాగే వస్తువులు శుభ్రంగా ఉంచండి,దగ్గును పేపర్లోకే దగ్గండి.
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు.
www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
దగ్గులు, జలుబులు & జబ్బులు ; పిల్లలు ఏం చేయగలరు?
- జలుబులు, దగ్గులు ఇంకా జబ్బుల గురించి మన సందేశాలను మనమే మన సొంత భాషలో, సొంత పదాల్లో తయారుచేసుకుందాం!
- ఈ సందేశాలను ఎప్పటికీ మర్చిపోకుండా నేర్చుకుని గుర్తుపెట్టుకుందాం!
- ఇతర పిల్లలు, మన కుటుంబాలతో కూడా ఈ సందేశాలను పంచుకుందాం!
- మీ ఇంటి ప్లాన్ తయారుచేయండి. ఎక్కడ సాధారణంగా పొగ వస్తుంది, ఎక్కడ రాదు? ఎక్కడ పొగకి దూరంగా పిల్లలు సురక్షితంగా ఆడుకోగలరు?
- హానికారక వ్యాధులైన ఆటలమ్మ, కోరింత దగ్గు వంటివాటికి తమ పిల్లలకి వ్యాక్సిన్ టీకాలు ఇప్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించటానికి పోస్టర్ తయారుచేయండి.
- న్యుమోనియా గురించి ఒక పాటను రాసి, మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి!
- ఒక దారం, రాయితో పెండ్యులంను తయారుచేసి, దాని సాయంతో మన శ్వాస ఎప్పుడు వేగంగా ఉందో, ఎప్పుడు శ్వాస సాధారణంగా ఉందో కౌంట్ చేయండి. దీనితో మనకేం అర్థమైందో మన కుటుంబాలతో పంచుకోవచ్చు.
- పిల్లలకి తల్లి పాలివ్వటం గురించి మన సొంత నాటిక రాసుకుందాం.
- జ్వరం వచ్చినపుడు చల్లగా ఉండటం, చలికాలంలో వెచ్చగా ఉండటం గురించి ఒక నాటిక తయారుచేయండి.
- టాయిలెట్ వాడిన ముందు, తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవటానికి ఇంట్లో, స్కూలులో సాయంగా ఒక నీరు పడే ట్యాప్ ను తయారుచేయండి.
- జలుబు, దగ్గుకి దూరంగా ఉండటానికి మీ చేతులని సబ్బు, నీళ్లతో ఎలా కడుక్కోవాలో, సూక్ష్మజీవులు ఎలా వ్యాపించకుండా చేయాలో నేర్చుకోండి.
- న్యుమోనియా లేదా జలుబు వచ్చినపుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో నటించి న్యుమోనియా గురించి మనం ఎంత నేర్చుకున్నామో పరీక్షించుకోండి.
- న్యుమోనియాలో అపాయకరమైన లక్షణాలు ఏంటో అడగండి? ఏం నేర్చుకున్నారో కుటుంబాలతో పంచుకోండి.
- ఎక్కడ పొగ తాగటం నిషేధించబడిందో అడగండి? మీ స్కూలులో నిషేధం ఉందా లేదా?
- మనం కొన్నిసార్లు శ్వాస ఎందుకు వేగంగా తీసుకుంటామో అడగండి?మన శ్వాసను గమనించటం ద్వారా వేగంగా శ్వాస తీసుకుంటున్నవారు న్యుమోనియా అపాయకర లక్షణాలు చూపిస్తున్నట్లు గుర్తించవచ్చు.
- దగ్గు,జలుబులను నయం చేయటానికి కొత్త ఇంకా పాత పద్ధతులు ఏంటో అడగండి?
- సూక్ష్మజీవులు ఎలా వ్యాపిస్తాయో అడగండి? ద హాండ్ షేకింగ్ గేమ్ ఆడటం ద్వారా నేర్చుకోండి.
టిప్పీ ట్యాప్ గురించి, పెండ్యులం లేదా చేతులు కదిపే ఆట లేదా మరేదైనా సమాచారం కోసం ఇక్కడ సంప్రదించండి.
www.childrenforhealth.org లేదా
clare@childrenforhealth.org.
3
3. రోగనిరోధకత అందివ్వటం (Telugu, Immunisation)
- ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం తమ పిల్లలు బలంగా, వ్యాధుల నుంచి రక్షణ పొందటం కోసం టీకా వ్యాక్సిన్ అందివ్వటానికి తీసుకెళ్తారు.
- మీకు అంటువ్యాధి సోకి జబ్బుపడినప్పుడు, కన్పించని సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి, మరింతగా మారి శరీరం సరిగా పనిచేయదు.
- మీ శరీరంలో ప్రత్యేక సైనికుల్లాంటి రక్షకులు ఉంటారు వారిని యాంటీబాడీస్ అంటారు. ఇవి సూక్ష్మజీవులతో పోరాడతాయి. సూక్ష్మజీవులు చచ్చిపోతే, యాంటీబాడీస్ శరీరంలో ఉండి మళ్ళీ పోరాడటానికి రెడీ అవుతాయి.
- వ్యాధి టీకాలు యాంటిజెన్లను శరీరంలో ప్రవేశపెడుతుంది (ఇంజెక్షన్ లేదా నోటి ద్వారా). అవి మీ శరీరానికి సైనికుల్లాంటి యాంటీబాడీస్ ను తయారుచేసి వ్యాధులతో పోరాడేలా శిక్షణనిస్తాయి.
- కొన్నిసార్లు ఈ టీకాలను శరీరానికి ఒకసారి కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, దీనివల్ల శరీరం వ్యాధికి వ్యతిరేకంగా సరిపోయే యాంటీబాడీస్ తయారుచేసుకునేందుకు శక్తి లభిస్తుంది.
- తీవ్ర వ్యాధులు ప్రాణాంతకంగా మారి చావుకి, చాలా బాధకి దారితీయవచ్చు, ఆటలమ్మ, క్షయ,ఢిఫ్తీరియా, కోరింత దగ్గు,పోలియో,ధనుర్వాతం (ఇంకెన్నో!) వ్యాధులు టీకా వ్యాక్సిన్ల ద్వారా నివారించబడతాయి.
- మీ శరీరాన్ని రక్షించటానికి, వ్యాధి వచ్చేముందే మీరు వ్యాక్సిన్ తో రోగనిరోధకత పెంచుకుని ఉండాలి.
- పిల్ల్లల్ని వ్యాధుల నుంచి రక్షించటానికి పసిపిల్లలకి వెంటనే వ్యాక్సిన్లు ఇస్తారు, ఒకవేళ భవిష్యత్తులో వారు వ్యాక్సిన్ మిస్సయినా పుట్టినవెంటనే ఇవ్వటంతో కొంతవరకు రోగనిరోధకత పనిచేస్తుంది.
- పిల్లలకి వివిధ రోగాలకి, వివిధ సమయాలలో ఈ రోగనిరోధక వ్యాక్సిన్లను ఇవ్వవచ్చు. మీ చుట్టుపక్కల ఎక్కడ, ఎప్పుడు పిల్లలకి టీకాలు వేస్తున్నారో తెలుసుకోండి.
- మీ పాపాయిలు లేదా పసిపిల్లలు టీకాలు వేసే రోజు కొంచెం బాగాలేకపోయినా కూడా వ్యాక్సిన్ టీకాలు వేయవచ్చు.
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
నీళ్లు మరియు పారిశుధ్యం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి నీళ్లు మరియు పారిశుధ్యం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- మన చేతులను ఏ రకంగా శుభ్రంగా వుంచుకోవాలో నేర్పునటువంటి ఒక పాటను నేర్చుకోండి
- శుభ్రమైన కుటుంబం క్రిముల కుటుంబం వుండే ఊరి లోకి వచ్చినపుడు క్రిముల కుటుంబానికి ఏమవుతుందో తెలిపే నాటికగాని లేదా క్రిములు ఎక్కడ దాక్కుంటాయో తెలిపే నాటిక గాని ఒకటి తయారు చేసి మరియు ఆడి చూపండి
- మన తమ్ముళ్లు మరియు చెల్లెళ్లు చేతులు శుభ్రంగా ఎలాగ కడుక్కోవాలో తెలుసుకొనేటట్లు వారికి సహాయ పడండి
- ఒక గుంపులో వున్న మనుషులు ఒక గంటలో ఎన్ని సార్లు వారు తమ తమ ముఖాలను, దుస్తులను, ఇతరులను ముట్టుకుంటున్నారో గమనిస్తూ, ఆ వివరాలను ముద్రితం చేయండి
- క్రిములు చేతి నుండి శరీరం లోకి విస్తరించే మార్గాలన్నిటి గురుంచి ఆలోచించండి
- పాఠశాలలోని మూత్రశాలలు శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
- వడపోత ద్వారా నీటిని శుభ్రపరచడం నేర్చుకోండి
- పాఠశాల పరిసరాలు చెత్తలేకుండా శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
- పాఠశాల్లో ఒక ఆరోగ్య సంఘాన్ని స్థాపించండి
- క్రిములు, ఈగలు, మురికి ల గురించి మనకు తెలిసినదంతా మన కుటుంబాలతో పంచుకోండి
- నీటి కుండను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు మూత పెట్టి ఉంచండి. ఎల్లప్పుడూ గరిట వాడండి. చేతిని వాడకండి. మన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కుండా నుండి నీటిని ఎలా తీయాలో చేసి చూపండి
- టిప్పి ట్యాప్ ను అందరు కలసి తయారు చేయండి
- సబ్బును పట్టి ఉంచడానికి వాష్ మిట్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
- కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛును ప్లాస్టిక్ సీసా మరియు కొంత పంచదార నీటితో తయారు చేయండి
- సూర్యకాంతి ని ఉపయోగించి ఇంటిలో తాగే మంచి నీటిని తయారు చేయడంలో సహాయపడండి
- ఇసుక వడపోతను ఉపయోగించి మురికి నీటిని శుభ్రం చేయండి
- తడి వంట పాత్రలు, పళ్ళాలు ఎండలో పొడి అయ్యేందుకు వీలుగా అరలను తయారు చేయండి
- మన చేతులను క్రిములనుండి శుభ్రంగా ఎలా వుంచగలమో అడగండి. మన ఇంటిలో చేతులు కడుగుకోవడానికి సబ్బు వుందా? స్థానిక దుకాణంలో సబ్బు ధర ఎంత? మన శరీరాలను శుభ్రంగా ఎలా ఉంచుతాం? మన పళ్ళను ఎలా శుభ్రం చేసుకుంటాం? క్రిములు ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా వ్యాపిస్తాయి? కీటకాలు ఏమి తింటాయి, ఎలా బతుకుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి? కీటకాలు తమ కాళ్ళ ద్వారా ఎలా మురికి వ్యాపింపచేస్తాయి? మన నీటి వనరులు ఏవి? మురికి నీటిని ఏ విధంగా తాగడానికి అనుకూలంగా మార్చవచ్చు? ప్లాస్టిక్ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలాంటి గుడ్డను నీటి వడపోతకు ఉపయోగించొచ్చు? వంట తయారు చేయునప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు అనుసరిస్తారు? ఇంటిలో లేదా మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలు కీటకాలు ఎక్కువగా ఉండటానికి అనువైనవి?
మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.
4
4. చలిజ్వరం (Telugu, Malaria)
- చలి జ్వరం దోమ కాటు వలన వ్యాపిస్తుంది
- చలి జ్వరం ప్రమాదమైనది. దీని వలన ముఖ్యంగా చిన్నపిల్లలకు మరియు గర్భవతులకు జ్వరం వచ్చి మరణం కూడా సంభవించవచ్చు
- దోమలను చంపే క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరల కింద పడుకొని దోమ కాట్లనుండి కాపాడుకోండి
- చలి జ్వరం కలిగించే దోమలు సాధారణంగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం లోపల కుడతాయి
- చలి జ్వరం బారిన పడిన పిల్లలలో అభివృద్ధి చాలా నెమ్మదిగా వుంటుంది
- దోమలను చంపే క్రిమి సంహారకాలను మూడు రకాలుగా పిచికారీ చేయవచ్చు : ఇళ్లలో, గాలిలో, నీటి మీద
- తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల మరియు కడుపు నొప్పి మరియు వణుకు చలిజ్వరానికి గుర్తులు. వేగవంతమైన పరీక్షలు, చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు
- ఆరోగ్య సహాయకుడు సూచించిన మందుల ద్వారా చలిజ్వరం రాకుండా లేదా తగ్గునట్లు చూడవచ్చును
- చలిజ్వరం సోకిన వ్యక్తి రక్తం లో వుండి, రక్త హీనత కలుగచేసి, వారిని బలహీనులుగా చేస్తుంది
- చలిజ్వరం వ్యాపించి వున్న సంఘాలలో, మందుల ద్వారా చలిజ్వరం మరియు రక్త హీనతను తగ్గించుట లేదా రాకుండా చేయవచ్చును
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
చలిజ్వరం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి చలిజ్వరం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- చలిజ్వరం ఎలా వ్యాపిస్తుందో, దానిని మనం ఎలా ఎదుర్కోవచ్చో ఇతరులకు తెలిసేలా పత్రికలు ముద్రించండి
- దోమల జీవిత చక్రం గురించి కధలు లేదా నాటికలు తయారు చేసి పిల్లలకు వినిపించండి
- క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలను ఎలా ఉపయోగించాలో తెలుపుతూ పత్రికలను ముద్రించండి
- దోమకాటునుండి ఎలా తప్పించుకోవచ్చో తెలుపుతూ కధలు చెప్పడం, పత్రికలు ముద్రించడం చేయండి
- చలిజ్వరం గుర్తులను పిల్లలు ఎలా గుర్తించగలరో తెలుపుతూ కధలు లేదా నాటికలు తయారుచేయండి
- ఇతర పిల్లలలో చలిజ్వరం గుర్తులను పిల్లలు ఎలా గుర్తించగలరో మరియు పెద్దలను వారిని పరీక్షలకు తీసుకెళ్లమని అడగగలరో తెలుపుతూ కధలు లేదా నాటికలు తయారుచేయండి
- చలిజ్వరం మరియు రక్తహీనతల గుర్తుల మీద కధలు, నాటికలు రాయండి. పురుగుల వలన మరియు చలిజ్వరం వలన రక్తహీనత ఏ విధంగా కలుగుతుందో తెలపండి
- మన సంఘంలో దొరికే ఐరన్ ఎక్కువ వుండే పదార్థాలమీద పత్రిక ముద్రించండి
- దోమలు కుట్టే సమయంలో పిల్లలు దోమ తెరలలోనే ఉండేటట్లు సహాయ పడండి
- దోమ తెరలు చిరుగులు లేకుండా సరైన విధంగా కట్టబడి వున్నట్లు నిశ్చయించుకోండి
- ప్రజలు ఎందుకు దోమ తెరలంటే ఇష్టపడతారో / ఇష్టపడరో, దోమ తెరల వలన ఏ ఏ ఉపయోగాలుంటాయనుకుంటున్నారో తెలుపుతూ కధలు, నాటికలు తయారుచేయండి
- దోమ తెరలను ఎలా ఉపయోగించాలో వివరిస్తూ ప్రచారం చేయండి
- ఒక ఆరోగ్య సహాయకుని పాఠశాలకు రప్పించి పెద్ద పిల్లలకు దోమ తెరల గురించి మరియు పరీక్షల గురించి బోధపరచమనండి
- పాటల ద్వారా, నృత్యాల ద్వారా, నాటికల ద్వారా ఇతరులకు సమాచారాన్ని చేరవేయండి
- మన కుటుంబలో ఎంతమందికి చలిజ్వరం వచ్చిందో అడగండి. మనం చలిజ్వరాన్ని ఎలా అరికట్టవచ్చు? ఎక్కువకాలం మన్నే క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలను ఎలా ఉపయోగించాలి? కిటికీ తెరలు ఏ విధంగా పనిచేస్తాయి? వాటిని ఎలా ఉపయోగించాలి? మన సంఘంలో క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలు ఎప్పుడు లభ్యమవుతాయి? చలిజ్వరం ఏ విధంగా ప్రాణాంతకం? గర్భవతులకు, చిన్నపిల్లలకు చలిజ్వరం ఎందుకు ఎక్కువ ప్రమాదకరం? ఆరోగ్య సహాయకులు అప్పుడే పుట్టిన బిడ్డలు కల తల్లులకు చలిజ్వరం రాకుండా ఏమి ఇస్తారు? ఇనుము ఎక్కువ కలిగిన ఆహారాలు (మాంసం, కొన్ని రకాల ధాన్యాలు, పచ్చని ఆకుకూరలు) రక్తహీనతను ఎలా పారదోలుతాయి? దోమ కాట్ల నుండి ప్రజలు తమని, ఇతరులని ఎలా కాపాడుకోగలరు? చలిజ్వరం రక్తంలో ఉందో లేదో తెలుసుకొనుటకు చేసే పరీక్షలేమిటి?
మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.
5
5. అతిసారం (Telugu, Diarrhoea)
- అతిసారం సోకినప్పుడు నీళ్ల విరేచనాలు రోజుకు మూడు నాల్గు సార్లు అవుతాయి
- కలుషితమైన ఆహారం లేదా నీటి లో వుండే సూక్ష్మ క్రిములు నోటిద్వారా ప్రవేశించడం వల్ల, మురికి వేళ్ళతో నోటిని ముట్టుకొనడం వల్ల లేదా అపరిశుభ్రమైన గిన్నెల వల్ల అతిసారం కలుగుతుంది
- నీరు, లవణాలు ఎక్కువ పోవుట వలన శరీరం నీరసిస్తుంది. ద్రవాలను వెంటనే తీసుకొనకపోతే చిన్నపిల్లలు నిర్జలీకరణ వల్ల మరణించే ప్రమాదముంది
- శుభ్రమైన నీరు, కొబ్బరి నీరు, గంజి ఇవ్వడం ద్వారా అతిసారాన్ని అరికట్టవచ్చు. శిశువులకు తల్లి పాలు అన్నిటికంటే ముఖ్యం
- అతిసారం సోకిన పిల్లలలో పిడచకట్టిన నోరు, నాలిక, గుంటలు పడిన కళ్ళు, కన్నీళ్లు లేకపోవుట, వదులైన చర్మం, చల్లని చేతులు, పాదాలు కలిజి ఉంటాయి. కొంతమంది శిశువులలో తలమీద గుంటలు పడిన మెత్తటి ప్రదేశం ఏర్పడుతుంది
- రోజుకు అయిదు సార్లు కంటే నీళ్ల లేదా రక్త విరేచనాలు చేసుకొను లేదా వంతులుచేసుకొను పిల్లలను వెంటనే ఆరోగ్య సహాయకులకు చూపించాలి
- ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ దొరికే దుకాణాలు, ఆసుపత్రులు ఎక్కడున్నాయో తెలుకోండి. దానిని శుభ్రమైన నీటిలో సరైన మోతాదులో కలుపుకొని అతిసారం తగ్గించే ద్రవాన్ని తయారుచేయండి
- మందులేవీ అతిసారానికి పనిచేయకపోవచ్చు. కానీ 6 నెలలు నిండిన పిల్లలకు జింక్ మాత్రలు అతిసారాన్ని తగ్గిస్తాయి. ఓఆర్ఎస్ ద్రవం కూడా ఇవ్వవలెను
- అతిసారం సోకిన చిన్న పిల్లలకు రుచికరమైన, ముద్ద చేసిన ఆహారాన్ని ఎక్కువసార్లు ఇస్తూ ఉండాలి
- పిల్లలకు చనుబాలు ఇవ్వడం ద్వారా, మంచి ఆరోగ్య అలవాట్ల ద్వారా, నిరోధిక శక్తినిచ్చు మందుల ద్వారా, సుక్షితమైన ఆహారం ద్వారా అతిసారాన్ని అరికట్టవచ్చు
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
అతిసారం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి అతిసారం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- అతిసారం యొక్క ప్రమాదకరమైన గుర్తులు ఇతరులకు తెలిసేటట్లు పత్రికలూ వేయండి
- ఆరోగ్య సహాయకుని ఎప్పుడు పిలవాలో తెలుపుతూ ఒక నాటిక రాయండి
- అతిసారాన్ని అరికట్టడమెలాగో తెలిసేటట్లు పాము నిచ్చెన ఆటను రూపొందించండి
- ఇళ్లలోనూ, పాఠశాలలోనూ ఓఆర్ఎస్ కలిగి వున్నా ప్రధమ చికిత్స డబ్బాలను తయారుచేయండి
- ఇద్దరు తల్లులు తమ పిల్లలను అతిసారం నుండి ఏ విధంగా రక్షిస్తున్నారో మాట్లాడుకొనునట్లు ఒక నాటిక రాయండి
- అతిసార గుర్తులు మనకు ఎంత తెలుసో తెలుసుకొనుటకు ఒక ఆటను తయారుచేయండి
- మొక్కలు పెరగడానికి నీరు ఎంత అవసరమో గమనించండి. మొక్కలకు నీళ్లు లేకపోతే ఏమవుతుందో తెలుసుకోండి
- మనం నివసించే ప్రదేశాలను, మనను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అతిసారాన్ని అరికట్టండి
- సూక్ష్మ క్రిములు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో తెలిపే కరచాలన ఆటను తయారు చేయండి
- మన తల్లులు ఎంత వరకు చనుబాలు ఇచ్చారో అడగండి. ఓఆర్ఎస్ మరియు జింక్ తో అతిసారాన్ని ఎలా అరికట్టొచో అడగండి. ఏ ఏ ప్రమాద సూచికలప్పుడు మనం ఆరోగ్య సహాయకుల సహాయం తీసుకోవాలి? మనకు అతిసారం వున్నప్పుడు ఏ ఏ ద్రవపదార్థాలు మంచివి? సూర్యకాంతినుపయోగించి మన తాగే నీటిని ఏ రకంగా సురక్షితంగా చేసుకోవచ్చు? మనకు ఎటువంటి ఓఆర్ఎస్ లేనపుడు ఎటువంటి ద్రవాలు మంచివి? జిగట విరేచనాలు, కలరా అంటే ఏమిటి? అవి ఎలా వ్యాప్తి చెందుతాయి?
ఫ్లై ట్రాప్, కరచాలన ఆట, సూర్యకాంతితో నీటిని సురక్షితం చేయు విధానం మొదలగు వాటి గురించి మరింత సమాచారం కొరకు www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి
6
6. నీళ్లు మరియు పారిశుధ్యం (Telugu, Water, Sanitation & Hygiene)
- చేతులు శుభ్రంగా కడుగుకోవడానికి నీళ్లను, కొద్దిగా సబ్బును వాడండి. 10 సెకనుల పాటు చేతులు రుద్దుకోండి. చేతులను గాలిలో లేదా శుభ్రమైన కాగితం/ గుడ్డతో తుడుచుకోండి. మురికి గుడ్డతో తుడుచుకోవద్దు
- మీ ముఖం పైన టీ జోన్ (కళ్ళు, ముక్కు, నోరు) ను ముట్టుకొనే ముందు చేతులను శుభ్రంగా తుడుచుకోండి. అవకాశముంటే టీ జోన్ ముట్టుకోకుండా చూసుకోండి
- ఆహారం తయారు చేసేముందు, తినేముందు, పిల్లలకు పెట్టేముందు, మల మూత్ర విసర్జన చేసిన తరువాత, శిశువులకు స్నానం చేసే ముందు లేదా రోగగ్రస్తులకు సేవ చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోండి
- మీ శరీరం, బట్టలు శుభ్రంగా ఉంచుకోండి. మీ గోళ్లను, కాళీ వేళ్ళను, పళ్ళను, చెవులను, ముఖమును, కళ్ళను శుభ్రంగా ఉంచుకోండి. జోళ్ళు సూక్ష్మ జీవులనుండి రక్షణ కల్పిస్తాయి
- మనుషుల, పశువుల మల మూత్రాలమీద సూక్ష్మ క్రిములు చేరకుండా చూసుకోండి. మూత్రశాలలు ఉపయోగించి, చేతులు కడుగుకోండి
- మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం, అంటుకొని కళ్ళముందు ఈగలు తిరుగునపుడు మీ ముఖాన్నినీళ్లతోను, కొద్దిపాటి సబ్బుతోను కడుగుకోండి.
- శుభ్రమైన, సురక్షితమైన నీటిని అపరిశుభ్ర ,చేతులతోనూ, గిన్నెలతోనూ ముట్టుకోకండి. దానిని సూక్ష్మ క్రిములనుండి సురక్షితంగా ఉంచండి
- సూర్యకాంతి నీళ్లను సురక్షితంగా చేస్తుంది. సీసాలలో నీటిని తాగటానికి సురక్షితమైన వరకు ఒక 6 గంటలు అలా ఉంచండి
- కంచాలు, గిన్నెలు కడిగిన తర్వాత సూక్ష్మ క్రిములు నాశనమయ్యేట్టు సూర్యకాంతిలో అవకాశముంటే ఉంచండి
- మన సంఘాన్ని చెత్త నుండి దూరంగా ఉంచి ఈగలు, దోమలను తగ్గించండి . చెత్తను కాల్చడం లేదా కప్పడం చేసే వరకు ఒక చోటనే ఉంచండి
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
నీళ్లు మరియు పారిశుధ్యం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి నీళ్లు మరియు పారిశుధ్యం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- మన చేతులను ఏ రకంగా శుభ్రంగా వుంచుకోవాలో నేర్పునటువంటి ఒక పాటను నేర్చుకోండి
- శుభ్రమైన కుటుంబం క్రిముల కుటుంబం వుండే ఊరి లోకి వచ్చినపుడు క్రిముల కుటుంబానికి ఏమవుతుందో తెలిపే నాటికగాని లేదా క్రిములు ఎక్కడ దాక్కుంటాయో తెలిపే నాటిక గాని ఒకటి తయారు చేసి మరియు ఆడి చూపండి
- మన తమ్ముళ్లు మరియు చెల్లెళ్లు చేతులు శుభ్రంగా ఎలాగ కడుక్కోవాలో తెలుసుకొనేటట్లు వారికి సహాయ పడండి
- ఒక గుంపులో వున్న మనుషులు ఒక గంటలో ఎన్ని సార్లు వారు తమ తమ ముఖాలను, దుస్తులను, ఇతరులను ముట్టుకుంటున్నారో గమనిస్తూ, ఆ వివరాలను ముద్రితం చేయండి
- క్రిములు చేతి నుండి శరీరం లోకి విస్తరించే మార్గాలన్నిటి గురుంచి ఆలోచించండి
- పాఠశాలలోని మూత్రశాలలు శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
- వడపోత ద్వారా నీటిని శుభ్రపరచడం నేర్చుకోండి
- పాఠశాల పరిసరాలు చెత్తలేకుండా శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
- పాఠశాల్లో ఒక ఆరోగ్య సంఘాన్ని స్థాపించండి
- క్రిములు, ఈగలు, మురికి ల గురించి మనకు తెలిసినదంతా మన కుటుంబాలతో పంచుకోండి
- నీటి కుండను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు మూత పెట్టి ఉంచండి. ఎల్లప్పుడూ గరిట వాడండి. చేతిని వాడకండి. మన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కుండా నుండి నీటిని ఎలా తీయాలో చేసి చూపండి
- టిప్పి ట్యాప్ ను అందరు కలసి తయారు చేయండి
- సబ్బును పట్టి ఉంచడానికి వాష్ మిట్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
- కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛును ప్లాస్టిక్ సీసా మరియు కొంత పంచదార నీటితో తయారు చేయండి
- సూర్యకాంతి ని ఉపయోగించి ఇంటిలో తాగే మంచి నీటిని తయారు చేయడంలో సహాయపడండి
- ఇసుక వడపోతను ఉపయోగించి మురికి నీటిని శుభ్రం చేయండి
- తడి వంట పాత్రలు, పళ్ళాలు ఎండలో పొడి అయ్యేందుకు వీలుగా అరలను తయారు చేయండి
- మన చేతులను క్రిములనుండి శుభ్రంగా ఎలా వుంచగలమో అడగండి. మన ఇంటిలో చేతులు కడుగుకోవడానికి సబ్బు వుందా? స్థానిక దుకాణంలో సబ్బు ధర ఎంత? మన శరీరాలను శుభ్రంగా ఎలా ఉంచుతాం? మన పళ్ళను ఎలా శుభ్రం చేసుకుంటాం? క్రిములు ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా వ్యాపిస్తాయి? కీటకాలు ఏమి తింటాయి, ఎలా బతుకుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి? కీటకాలు తమ కాళ్ళ ద్వారా ఎలా మురికి వ్యాపింపచేస్తాయి? మన నీటి వనరులు ఏవి? మురికి నీటిని ఏ విధంగా తాగడానికి అనుకూలంగా మార్చవచ్చు? ప్లాస్టిక్ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలాంటి గుడ్డను నీటి వడపోతకు ఉపయోగించొచ్చు? వంట తయారు చేయునప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు అనుసరిస్తారు? ఇంటిలో లేదా మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలు కీటకాలు ఎక్కువగా ఉండటానికి అనువైనవి?
కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛు, సూర్యకాంతి తో నీటిని శుభ్రపరచు విధానం, ఇసుక వడపోత తయారు చేయు విధానం, వాష్ మిట్ మరియు టిప్పి ట్యాప్ తయారు చేసే విధానం మొదలగు వాటి గురుంచి మరింత సమాచారం కొరకు www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి
7
7. న్యూట్రిషన్ (Telugu, Nutrition)
- మన శరీరం చలాకీగా ఉండటానికి, పెరగడానికి, కాంతివంతంగా ఉండటానికి ఉపయోగ పడే ఆహారం మన శరీరానికి చాలా అవసరం
- తక్కువగా తినడం, చెత్త ఆహారం తీసుకొనడం పోషకాహార లోపానికి కారణాలు. సరైన మోతాదులో మంచి ఆహారాన్ని భోజనంలో తీసుకొనుట ద్వారా దానిని అరికట్టండి
- రెండేళ్ల లోపు పిల్లలు సరిగా పెరుగుతున్నారా లేదో తెలుసుకొనుటకు వారిని ప్రతి నెలా పిల్లల ఆసుపత్రిలో బరువు చూపిస్తూ ఉండాలి
- పిల్లలు సన్నగా వున్నా, ముఖం, పాదాలు పొంగి వున్నా, నిశ్చలంగా వున్నా వారిని ఆరోగ్య శిక్షణనిచ్చు వారికి చూపించాలి
- అనారోగ్యంగా వున్నపుడు పిల్లలలో ఆకలి ఉండదు. వారు ఆరోగ్యవంతులవుతున్నప్పుడు, వారికి ఎక్కువ మోతాదులో పులుసు, ఆహారం ఇవ్వండి
- పుట్టినప్పటినుండి ఆరు నెలల దాకా చను పాలు మాత్రమే పిల్లలకు కావాలి.
- ఆరు నెలలు దాటినా తర్వాత పిల్లలకు ముద్దగా చేసిన ఆహారంను రోజుకు మూడు నుండి నాలుగు సార్లు ఇస్తూ, మధ్య మధ్య లో అల్పాహారాన్ని కూడా ఇవ్వాలి
- వివిధ రకాలైన సహజ ఆహారాన్ని ప్రతీ వారం ఇవ్వడం వలన సమతూకంగా ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది
- ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ పళ్ళు, కూరగాయలలో అధిక పోషణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి
- మీరు తినే ఆహారాన్ని ఉడికించి ముందు కడుగుట వలన అనారోగ్యం పాలవరు. ఉడికించిన ఆహారాన్ని వెంటనే భుజించండి లేదా సరిఅయిన పద్దతిలో భద్రపరచండి
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
న్యూట్రిషన్ – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి న్యూట్రిషన్ పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- వృద్ధి పట్టికను ఇతర పిల్లలతో మరియు పెద్దవారితో కలసి చూసి దానిలో ఉన్న గీతల అర్ధాన్ని తెలిసుకునేట్టు పని చేయండి. ఈ వృద్ధి పట్టికనే ఆరోగ్య మార్గ పట్టిక అని కూడా పిలుస్తారు. ఇది మీ ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది
- మీ దగ్గర లో వున్న ఆరోగ్య కేంద్రంకి వెళ్లి పిల్లల బరువు తూచే విధానం, వృద్ధి పట్టికలో నమోదు చేసే విధానం తెలుసుకోండి
- ఆరోగ్య కేంద్రాల్లో పిల్లల బరువు తూచే విధానం చూసి తెలుసుకోండి
- వారికి తెలిసిన పిల్లలలో ఎవరైనా పోషకాహార లోపం తో బాధపడుతున్నారా, వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు అని చర్చించండి
- మన కుటుంబ సభ్యులు ప్రతి రోజు/ ప్రతి వారం ఏమి తింటున్నారు? మనం ప్రతి వారంలో ఎన్ని సహజ రంగుల కూరగాయలు తింటున్నాము ? మన కుటుంబ సభ్యులందరికి చలాకీగా ఉండటానికి, ఎదుగుదలకు, కాంతివంతంగా ఉండటానికి సరిపడినంత ఆహారం దొరుకుతోందా? మనకి ఈ వివరాలు ఎలా తెలుస్తాయి? ఎవరైనా పెద్దవారు లేదా చిన్నవారు తక్కువ తింటూ మనం వారిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా
- ఏ ఏ సమయాలలో మనం తినే ఆహరం వల్ల అనారోగ్యం పాలవుతామో అడిగి తెలుసుకోండి
- ఒక పిల్లవాడు పోషకాహార లోపంతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులకి, ఆరోగ్య కార్మికుడికి, ఇతరులకు ఏ విధంగా తెలుస్తుందో తెలుసుకోండి
- ఏ ఏ ఆహరం శిశువులకు, పిల్లలకు హాని చేస్తుందో ఒక బొమ్మ గీసి, ప్రతి ఆహరం బొమ్మ పక్కన అది ఏ విధంగా హాని కలిగిస్తుందో తెలపండి
- ఆరు నెలలు నిండిన పిల్లలకు వారి తల్లులు మొదటగా ఇచ్చే ఆహారమేదో అడిగి తెలుసుకోండి. తమ పిల్లలకు ఏ ఏ సమయాలలో ఆహారం ఇస్తారు? దాని ఫలితాలు ఎలా వున్నాయో ఒక చోట రాసుకుని ఆ వివరాలను తర్వాత తమ స్నేహితులతో పంచుకొనవచ్ఛు
- తమ ప్రాంతాలలో విటమిన్ తో కూడిన ఏ ఏ ఆహరం దొరుకుతుంది? వాటిని ఇళ్లల్లో/ దుకాణాలలో ఎలా తయాఋ చేస్తారు తెలుసుకోండి
- ఏ విధంగా ఆహారం తయారు చేస్తున్నారు? పళ్ళాలు, పాత్రలు ఏ విధంగా కడుగుతున్నారు, వంట వండే వారు వండేటప్పుడు చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నారు మొదలగునవి గమనించండి
- ఒక వారంలో మనం ప్రతి రోజు తినే ఆహారం యొక్క చిత్రాలను గీసి వాటి గురుంచి రాయండి. ఈ చిత్రాలకు రంగులు చేర్చవచ్చు.
- ఆరు నెలలు నిండిన పిల్లలకు వారి తల్లులు మొదటగా ఇచ్చే ఆహారమేదో అడిగి తెలుసుకోండి. వాటి సమాధానాలను ఒక చోట రాసుకుని ఆ తర్వాత వాటి చిత్రాలను వారి స్నేహితుల సహాయంతో గీయండి
- శిశువులకు, పిల్లలకు ఏ ఏ ఆహారం మంచిది లేదా చెడ్డది తెలుసుకోండి. ఈ ఆహారాల వివరాలతో చిత్రాలను గీయవచ్చు
- ఒక శిశువు సరిగా పెరుతోందో లేదో తెలుసుకొనుటలో వృద్ధి పట్టిక ఎలా ఉపయోగపడుతుందో అడిగండి. ఒక ఆహారాన్ని ఏ విధంగా పొడిగా, తాజాగా వుంచుతున్నారో అడిగి తెలుసుకోండి. సహజ రంగులతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంయొక్క అవసరాన్ని అడగండి. అనారోగ్యంగా వున్నప్పుడు, అనారోగ్యం తగ్గిన వెంటనే తీసుకోవలసిన ఆహారమేమిటో అడగండి
- చనుబాలు యొక్క ప్రాముఖ్యత ఆరోగ్య కార్మికులను అడిగి తెలుసుకోండి
- అనారోగ్యంగా వున్న పిల్లలకు సరైన ఆహారం / ద్రావకం ఇవ్వడంలో మనం ఏ విధంగా సహాయ పడగలమో అడగండి
- మన ప్రాంతంలో/ మన స్నేహితులతో ఏ ఏ తల్లులు చనుపాలు పడుతున్నారో మరియు ఎందుకు పడుతున్నారో తెలుసుకోండి. శిశువులు పెరుగుతున్నపుడు ఏ రకంగా ఆహార అలవాట్లు మార్చాలో తెలుసుకోండి. సీసా పాలు ఏ విధంగా శిశువుల ఆరోగ్యానికి హానికరమో తెలుసుకోండి
- ఆహారం పాచిపోయి తినడానికి పనికిరాకపోయినపుడు ఏ విధంగా తెలపాలో, పిల్లలు తమ సహోదరుల ద్వారా మరియు ఇతరుల ద్వారా తెలుసుకోవచ్ఛును
మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.
8
8. ప్రేగు క్రిములు (Telugu, Intestinal Worms)
- లక్షల సంఖ్యలో వున్న పిల్లల శరీర భాగాలలో క్రిములు ఉంటాయి. మనం ఆహారం చేరే శరీర భాగమైన ప్రేగులలో ఈ క్రిములు ఉంటాయి
- వేరు వేరు రకాల క్రిములు మన శరీరంలో ఉంటాయి
- క్రిములు మానను అనారోగ్యం పాలు చేస్తాయి. వాటి వలన మనకు కడుపు నొప్పి, దగ్గు, జ్వరం మొదలగు అనారోగ్యాలు కలుగుతాయి
- క్రిములు మన శరీరంలో ఉండటం వల్ల అవి ఉన్నట్టు మనకు సాధారణంగా తెలియదు. కానీ అప్పుడప్పుడు అవి మన మలం లో కనిపించవచ్చు
- క్రిములు వాటి గుడ్లు మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరుతాయి. కొన్ని మనం తినే ఆహారం ద్వారా, మనం తాగే కలుషితమైన నీటి ద్వారా, కొన్ని పాదాల ద్వారా చేరుతాయి
- క్రిములను క్రిమి సంహారిణి ద్వారా తొలగించడం చాలా సులభం మరియు చౌకైనది. ఆరోగ్య కార్మికులు వీటిని 6 లేదా 12 నెలలకొకసారి లేదా కొన్ని క్రిముల కోసం అంతకంటే ఎక్కువ మోతాదు లో ఇస్తారు
- క్రిముల మల మూత్రాలలో ఉంటాయి. సౌచాలయాలను ఉపయోగించండి లేదా మల మూత్రాలను సురక్షితంగా తొలగించండి. మల మూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం మరియు పిల్లలకు నేర్పడం ద్వారా మన చేతులలో క్రిముల గుడ్లు చేరవు
- మల మూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా, తినే ముందు కాయగూరలను , పళ్ళను కడగడం ద్వారా మరియు చెప్పులను వేసుకొనుట ద్వారా క్రిములు మీ శరీరంలోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు
- కొన్ని క్రిములు మట్టిలో ఉంటాయి. కాబట్టి మట్టిని ముట్టుకొనిన ప్రతీసారి శుభ్రంగా కడుక్కోండి
- పళ్ళను కాయగూరలను తినే ముందు కడిగే నీటిలో మల మూత్రాలు కలువట్లేదని నిర్ధారణ చేసుకోండి
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రేగు క్రిములు – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి ప్రేగు క్రిములు పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- “మీ పాదాలతో ఓటు వేయండి” ద్వారా ప్రశ్నల పరీక్షను పెట్టి వారికి క్రిముల గురించి ఎంత తెలుసో తెలుసుకోండి
- క్రిముల గురుంచి ఒక కథను వినుట ద్వారా వాటిని అరికట్టడం ఎలాగో తెలుసుకోండి
- మన పాఠశాలలో ఆహారం ఎలా తయారు చేస్తారు, వంటివారు ఆ ఆహారాన్ని క్రిములు లేకుండా ఎలా భద్రపరుస్తారు తెలుసుకోండి
- మట్టిలోనూ నీటిలోనూ ఉండే క్రిములు వ్యాప్తి చెందకుండా ఉండటానికి మల మూత్ర విసర్జనకు ఎల్లప్పుడూ సౌచాలయాన్నే వాడండి
- మన చేతులను శుభ్ర పరుచుకోవడానికి నీటిని, సబ్బును, శుభ్రమైన గుడ్డను వాడండి
- మన కుటుంబంలో వారికి క్రిముల గురుంచి ఎంత తెలుసో తెలుసుకోండి
- చెడ్డ క్రిములు గురించి తెలుపుతూ, చెడ్డ క్రిములు తమ కుటుంబ సభ్యుల ఆహారాన్ని దొంగిలించకుండా పిల్లలు ఏ విధంగా అడ్డుకున్నారో తెలుపుతూ ఒక రాయండి
- ఆహారాన్ని కడగటం ద్వారా, మాంసాన్ని ఉడకపెట్టడం ద్వారా ఆహారాన్ని క్రిముల నుండి ఏ రకంగా సురక్షితంగా వుంచచ్చొ తెలుపుతూ పత్రికలు వేయండి
- మన కుటుంబం, మన తరగతి కొరకు “టిప్పి ట్యాప్” మరియు చేతులు కడుగుకొనే ప్రదేశం ఎలా తయారుచేయవచ్చొ తెలుసుకోండి
- క్రిముల వ్యాప్తి అరికట్టే విధానమెట్టిదో లేదా చేతులు కడిగే విధానం మనకి గుర్తు చేసేట్టు ఒక పాట రాయండి
- మనం కూరగాయలు తినే ముందు లేదా వండే ముందు వాటిని కడగవలసిన అవసరం మనకు తెలుపుతూ ఒక పత్రికను ముద్రించండి
- క్రిముల వ్యాప్తి అరికట్టే విధానం తెలుపుతూ ఒక నాటిక లేదా ఒక తోలు బొమ్మలాట ను తయారు చేయండి
- క్రిముల గురుంచి మనకి తెలిసినది గుర్తించుటకు ఒక నాటికను గాని ఖాళీలు పూరించు ఒక పదకేళి ని గాని తయారు చేయండి లేదా ఎప్పుడు మనం చేతులు కడుగుకోవాలో తెలిపే ఒక ప్రశ్నల పరీక్ష ను తయారు చేయండి
- మనం తినే ఆహారాన్ని మన శరీరం ఎలా ఉపయోగించుకొంటుంది? పెద్ద ప్రేవు ఎంత పొడుగు ఉంటుంది? క్రిములు మన ఆహారాన్ని ఎలా తీసుకొంటాయి? ఆంత్ర పరాన్న జీవ క్రిమి ఎంత పొడుగు పెరుగుతుంది? ఎన్ని రకాల క్రిములు మీకు తెలుసు? మీరు నివసించే ప్రదేశంలో ఏ క్రిములు ఎక్కువగా ఉంటాయి? వాటి గుర్తులేంటి? క్రిమి సంహారిక ద్రావకం ఎక్కడ దొరుకుతుంది మరియు దానిని ఎవరు తీసుకోవాలి? ఒక క్రిమి ఎన్ని గుడ్లు పెడుతుంది? క్రిములు మన ఇతర ఆహారాలతో బాటు విటమిన్-ఎ కూడా మన శరీరం నుండి తీసుకొంటాయి. విటమిన్-ఎ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? క్రిముల పిల్లలను లార్వా అంటారు. ఏ లార్వాలు మన చర్మం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి?సౌచాలయాలను ఉపయోగించుటవలన లేదా మల మూత్రాలను సురక్షితంగా తొలగించుటవలన క్రిముల వ్యాప్తి ని ఎలా అరికట్టవచ్చు? మన పాథశాలలలో క్రిమిసంహారక దినాలు ఉన్నాయా? అవి ఎప్పుడు? అదే రోజు అందరికి క్రిమి సంహారిక మాత్రలు ఎందుకిస్తారు? ప్రపంచంలో ఎంత మంది పిల్లల శరీరాల్లో క్రిములు ఉన్నాయి? క్రిముల వ్యాప్తి నివారణ ఎందుకు ముఖ్యం? మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? క్రిములు దానిపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి? మీకు తెలిసిన అతి చిన్న సంగతేది? నీళ్లు శుభ్రంగా ఉన్నాయో మురికిగా ఉన్నాయో ఎలా ?తెలుస్తుంది? మొక్కలు పెరగటానికి ఏమిటి అవసరం? మొక్కలకు సురక్షితమైన ఎరువును ఎలా తయారు చెయ్యాలి?
“టిప్పి ట్యాప్” మరియు చేతులు కడుగుకొనే ప్రదేశంలు తయారు చేసే విధానం, ఖాళీలు పూరించు ఒక పదకేళి గురించి లేదా మరి ఇంకేదైనా వివరాలగురించి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి.
9
9. ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడం (Telugu, Accidents & Injury Prevention)
- వంట శాలలు పిల్లలకు చాలా ప్రమాదకరం. వారిని నిప్పు నుండి, మొనదేరిన వస్తువులనుండి, బరువైన వస్తువులనుండి దూరంగా ఉంచండి
- పిల్లలు నిప్పులకు ఊదడం చేయకూడదు. అది అనారోగ్యం పాలు చేస్తుంది
- విషపదార్థాలను పిల్లలకు దూరంగా ఉంచండి. ఖాళీ శీతల పానీయాల సీసాలలో విష పదార్ధాలు ఉంచకండి
- పిల్లలకు కాలినపుడు, చల్లని నీటిని కాలిన చోట నొప్పి తగ్గేవరకు పోయండి (సుమారుగా 10 నిముషాల పైన)
- వాహనాలు, సైకిళ్ళు పిల్లల గాయాలకు, మరణాలకు కారణమవుతాయి. వీటి నుండి జాగ్రత్తగా వుండండి మరియు ఇతరులకు కూడా చూపండి
- చిన్న పిల్లలకు ప్రమాద వస్తువులైన కత్తులు, గాజు ముక్కలు, విద్యుత్తు తీగలు, మేకులు, పిన్నులు మొదలగు వాటిని గమనించండి
- చిన్న పిల్లలు మన్ను తినకుండా చూడండి మరియు వారు నాణేలు, బత్తాయిలు వంటి చిన్న చిన్న వస్తువులు నోటికి దగ్గరగా పెట్టుకోకుండా చూడండి. ఇవి ఊపిరిని అడ్డుకుంటాయి
- చిన్న పిల్లలు నీటి దగ్గర ఆడుకోకుండా చూడండి . లేదంటే వీరు వాటిలో (చెరువులు, సరస్సులు,బావులు) పడిపోయే ప్రమాదముంది
- ప్రధమ చికిత్స డబ్బాను ఇంటిలో పాఠశాలలో ఏర్పాటు చేయండి (సబ్బు, కత్తెర, జబ్బుల వ్యాప్తిని అరికట్టే మందు, దూది, ఉష్ణమాని, కట్టు, ఓఆర్ఎస్)
- ఏదైనా ప్రదేశానికి చిన్న పిల్లలతో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. చిన్న పిల్లలకు ఏమైనా ప్రమాదముందేమో తెలుసుకోండి, చూడండి
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడం – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి ప్రమాదాలు మరియు గాయాలు అరికట్టడంపైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- విష పదార్ధాలను సురక్షితంగా ఉంచడంపై పత్రాలను తయారు చేయండి . ఎలా భద్రపరచాలి, ఎలా గుర్తించాలి, పిల్లలకు ఎలా దూరంగా ఉంచాలి
- ఎవరైనా గాయపడితే ఉపయోగించడానికి ప్రధమ చికిత్స డబ్బాను తయారుచేయండి
- పిల్లలు ఆడుకోవటానికి సురక్షితమైన బొమ్మలను తయారుచేయండి
- చెరువు, సరస్సుల దగ్గర అత్యవసర సమయాలలో ఉపయోగించడానికి తాడు, తెలియుండే పదార్ధం తయారుచేసుకోండి
- ప్రధమ చికిత్స ప్రదేశాన్ని పాఠశాలలో తయారుచేసుకోండి
- పిల్లల భద్రత పై అవగాహన పెరగటానికి భద్రతా ప్రచారం చేయండి
- మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలలో పిల్లలకు ప్రమాదం కలిగించే స్థాయిలో నీరు ఉందొ, వాటినుండి పిల్లలను ఏ రకంగా భద్రంగా వుంచాలో తెలుసుకోండి
- “కానీ ఎందుకు” ప్రమాదాల గురించి ఆటను ఇళ్లల్లో ఆడండి
- మన ఇంటిని మరింత భద్రమైన ప్రదేశంగా తీర్చిదిద్దటానికి కావాల్సిన నాటికలు, పాటలు, పత్రికలు గూర్చి ఆలోచించండి
- ఇంటి లోనూ, పాఠశాలలోనూ ఉంచే ప్రధమ చికిత్స డబ్బాలో ఏమేమి ఉంచాలో ఆరోగ్య కార్మికులను తెలుసుకోండి
- పత్రిక లేదా చిత్రం లో వున్న అన్ని ప్రమాదాలను గుర్తించే ఆటలను తయారు చేసి ఆడండి
- రహదారులపై పిల్లల భద్రత గూర్చి అవగాహన పెంచడానికి ప్రచారం చేయండి
- పిల్లలను చూసుకునేటప్పుడు భద్రత గూర్చి అవసరమైన జాగ్రత్తలను తెల్పుతూ ఆడి చూపండి
- అత్యవసర పరిస్థితులలో సహాయపడటానికి వీలుగా ప్రధమ చికిత్స పద్దతులను నేర్చుకోండి. మన నైపుణ్యాన్ని అభివృద్ధి పరుచుకునే దిశగా ఈ పద్దతులను వల్లె వేస్తూ మన స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను ఆడి చూడండి
- పిల్లలకు ఏమైనా ప్రమాదకర పరిస్థితులు మన ఇంటిలో ఉన్నాయేమో చూడండి
- చిన్న పిల్లలకు గాయాలు తగిలే అవకాశాలేమేమి ఉన్నాయో పెద్దవారితో చర్చించండి
- చిన్న పిల్లలకు ఊపిరి ఆడనపుడు ఏమి చెయ్యాలో తెలుసుకుని, ఆ పద్ధతులను తల్లి దండ్రులతో, అన్న దమ్ములతో, తాతలతో పంచుకోండి
- కాలడానికి, పడిపోవడానికి, మునిగిపోవడానికి, రద్దీ వున్న రహదారుల మీద గాయపడటానికి ఎక్కడెక్కడ అవకాశాలున్నాయో గమనించండి
- ఇంటిలో కాలడానికి అవకాశమెంత? ఎవరికైనా కాలినపుడు ఏమి చేయాలి? పిల్లలను వేడి వస్తువులు, వేడి ద్రవాలనుండి దూరంగా ఎలా ఉంచాలి? మన సంఘంలో పెద్దలు పిల్లలను ప్రమాదాలకు దూరంగా ఉంచుతున్నారా? ఎలా ఉంచుతున్నారు? పెద్దవారు లేదా ఎదిగిన పిల్లలకంటే చిన్న పిల్లలలో ఊపిరి ఆడకుండా ఉండటానికి ఎందుకు అవకాశం ఎక్కువ? మనం ప్రమాదంలో పడకుండా నీటిలో మునిగిన వారికి ఏ విధంగా సహాయం అందించగలము?
టిప్పి ట్యాప్” తయారు చేసే విధానం, ప్రధమ చికిత్స డబ్బాలో ఏమేమి ఉంచాలి లేదా “ప్రమాదాలను గుర్తించు” నమూనా పత్రిక గురించి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి.
10
10. హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ (Telugu, HIV & AIDS)
- మన శరీరం అద్భుతమైనది. ప్రతీ రోజు అది మనం ముట్టుకునే, త్రాగే, ఊపిరి పీల్చుకొనే సూక్ష్మ జీవుల వల్ల కలుగు జబ్బులనుండి ప్రత్యేక పద్దతులలో కాపాడుతుంది
- హెచ్ ఐ వి అనేది వైరస్ (వి అంటే వైరస్) అనబడే ఒక సూక్ష్మ జీవి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటి వలన మన శరీరం ఇతర సూక్ష్మ జీవుల నుండి కాపాడుకొనే శక్తి ని కోల్పోతుంది
- శాస్త్రవేత్తలు హెచ్ ఐ వి ప్రమాదకరంగా మారకుండా ఉండటానికి మందులు కనిపెట్టారు గానీ, వీటిని శరీరం నుండి పూర్తిగా తొలగించే పద్దతి కనిపెట్టలేదు
- హెచ్ ఐ వి సోకి మందులు వాడని వారు కాలం తర్వాత ఎయిడ్స్ బారిన పడతారు. ఎయిడ్స్ అనేది కొన్ని ప్రమాదకర రోగాల సమాహారం. ఇది శరీరాన్ని రోజు రోజుకు చాలా నిరసింపచేస్తుంది
- హెచ్ ఐ వి రక్తంలోను, సంభోగ సమయంలో ఊరే ఇతర ద్రవాల్లోనూ కలిసిపోయి కనిపించకుండా ఉంటుంది. హెచ్ ఐ వి (1) సంభోగ సమయంలోనూ, (2) హెచ్ ఐ వి వున్న తల్లులనుండి పిల్లలకు, (3) రక్తం ద్వారా సంక్రమిస్తుంది
- సంభోగం ద్వారా హెచ్ ఐ వి సోకకుండా ప్రజలు ఈ కింది విధంగా అరికడతారు (1) సంభోగం లో పాల్గొనకుండా, (2) నమ్మకమైన సాన్నిహిత్యంతో, (3) కండోమ్ ఉపయోగించి సంభోగం జరుపుట ద్వారా
- హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ సోకిన వారితో ఆడుకొనవచ్చు, తాకవచ్చు, కౌగిలించుకొనవచ్చు. వీటి వలన హెచ్ ఐ వి సంక్రమించదు
- హెచ్ ఐ వి, ఎయిడ్స్ సోకిన వారు భయపడుతూ, విచారంగా ఉంటారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రేమ, సహకారాలు కావాలి. వారు వారి బాధలను ఇతరులతో పంచుకోవాలి
- హెచ్ ఐ వి సోకిందని అనుమానమొచ్చిన వారు, వారిని ఇతరులను కాపాడుకొనుటకు ఆరోగ్య కేంద్రానికి సలహాల గురించి, చికిత్స గురించి వెళ్ళాలి
- చాలా దేశాలలో హెచ్ ఐ వి సోకిన వారికి సహాయం మరియు చికిత్స అందుతుంది. ఏంటి రెట్రో వైరల్ థెరపీ (ART) అనే మందు వారు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది
ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.
ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.
హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ – పిల్లలు చేయగలిగినది ఏమిటి
- మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
- ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
- ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
- హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ గురించిన వివరాలను సేకరించి అందరితోనూ పంచుకోండి
- ఆరోగ్య శ్రామికులను పాఠశాలకు ఆహ్వానించి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ గురించిన అనుమానాలు నివృత్తి చేసుకోండి
- మన ప్రాంతంలో ఎయిడ్స్ సోకిన పిల్లల సహాయానికి పద్దతులను ఆలోచించండి
- జీవనాధార ఆటను ఆడుతూ, హెచ్ ఐ వి సోకడానికి గల అవకాశాలను గుర్తించండి
- హెచ్ ఐ వి సోకే పద్దతులను తెలిపే “నిజమా అబద్ధమా” ఆటను తయారు చేసి ఆడండి. చివరలో సహాయపడటానికి ప్రశ్నలడగండి
- ప్రత్యేక స్నేహాల గురించి, లైంగిక భావనల గురించి మాట్లాడటానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పండి
- మన ప్రత్యేక స్నేహాల ద్వారా హెచ్ ఐ వి సోకకుండా ఉండటానికి అవసరమైన అలవాట్లు తెలిపే “ఫ్లీట్ ఆఫ్ హోప్” ఆటను ఆడండి
- హెచ్ ఐ వి, ఎయిడ్స్ సోకిన వారి కష్టాలనన్నిటిని తెలుసుకొని వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించండి
- హెచ్ ఐ వి సోకిన వారిలా నాటిక వేస్తూ, వారి కష్టాలు తెలుసుకోండి
- హెచ్ ఐ వి సోకిన వారి గురించి వారి కష్టాల గురించి తెలిపే కధలను తెలుసుకోండి
- హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి మనకు తెలిసిన వివరాలతో ఒక ప్రశ్నావళిని రూపొందించండి
- హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి ప్రశ్నలకు మన తరగతి గదిలో ఒక ప్రశ్నల పెట్టెను ఉంచండి
- హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి ఒక పత్రాన్ని మన పాఠశాల కోసం తయారుచేయండి
- మీనా అను అమ్మాయి లేదా రాజీవ్ అనే అబ్బాయి, హెచ్ ఐ వి సోకిన వారి తల్లి మరియు మీనా తన తల్లిని ఆరోగ్యకేంద్రానికి వెళ్లి ART తీసుకొమ్మని బలవంతపెట్టేటట్టు ఒక నాటికను తయారు చేయండి
- హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ సంఘాన్ని ఒక దానిని స్థాపించి మన పాఠశాలలో, కుటుంబంలో అవగాహన పెంపొందించండి
- మన వ్యాధి నిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది? ఏ ఏ ఆహారాలు మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి? హెచ్ ఐ వి అంటే ఏమిటి? ఎయిడ్స్ అంటే ఏమిటి? ఎవరికైనా హెచ్ ఐ వి ఉందని తెలిస్తే ఏమవుతుంది? ఎవరైనా ఎయిడ్స్ బారిన పడితే ఏమవుతుంది? హెచ్ ఐ వి ఒకరినుంచి ఒకరికి ఏ విధంగా సంక్రమిస్తుంది? ఎలా సంక్రమించదు? మనం దానినుండి ఎలా కాపాడుకోగలం? హెచ్ ఐ వికి చికిత్స ఏమిటి? హెచ్ ఐ వి తల్లుల నుండి పిల్లలకు సంక్రమిచకుండా మందులు ఏ విధంగా కాపాడతాయి? ఏంటి రెట్రో వైరల్ థెరపీ (ART) ఎలా పనిచేస్తుంది? దానిని ఎప్పుడు వాడాలి? మన స్నేహాలు ఎప్పుడు మరియు ఎలా సంభోగానికి దారి తీస్తాయి? కండోమ్ ను సరిగా ఎలా ఉపయోగించాలి? (మగ/ ఆడా) హెచ్ ఐ వి బారిన పడిన మన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ లకు చికిత్సనందించే దగ్గరలోనున్న ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది?
జీవనాధార ఆట, “ఫ్లీట్ ఆఫ్ హోప్” ఆట లేదా “నిజమా అబద్ధమా” ఆట నమూనాల కోసం లేదా మరియే ఇతర వివరాలకోసం www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి.