పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

టాపిక్ 2 పై 10 సందేశాలు ఇవిగో ; దగ్గు, జలుబులు మరియు జబ్బులు

 1. కట్టెలతో వంట చేసినప్పుడు వచ్చే పొగలో రేణువులు కొన్ని ఊపిరితిత్తులలోకి చేరి అనారోగ్యాన్ని కలిగిస్తాయి.బయట వండవద్దు లేదా తాజా గాలి వచ్చేచోట చేస్తే పొగ గాలిలో కలిసిపోతుంది.sa,, picture of a person coughing
 2. పొగాకు పొగతాగడం వలన ఊపిరితిత్తులు బలహీనంగా మారుతాయి. ఇంకొకళ్ళు పొగ తాగుతుంటే ఆ పొగను పీల్చినా మీకు అపాయకరమే.
 3. ప్రతి ఒక్కరికీ దగ్గు, జలుబులు వస్తాయి. చాలామందికి అవంతట అవే తగ్గిపోతాయి. మూడు వారాల కన్నా ఎక్కువ దగ్గు లేదా జలుబు ఉంటే హెల్త్ క్లినిక్ కి వెళ్ళండి.
 4. సూక్ష్మజీవుల్లో బ్యాక్టీరియా, వైరస్ లని రెండు రకాలు ఉంటాయి. వైరస్ ల వలనే దగ్గు, జలుబులు వస్తాయి, ఇవి మందులతో చంపబడవు.
 5. శరీరంలో శ్వాస పీల్చుకునే అవయవాలు ఊపిరితిత్తులు. దగ్గు,జలుబులు ఊపిరితిత్తులను బలహీనపరుస్తాయి.న్యుమోనియా అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా బలహీనమైన ఊపిరితిత్తులలో తీవ్ర జబ్బును కలిగిస్తాయి.
 6. న్యుమోనియా(తీవ్రమైన జబ్బు)లో ఒక లక్షణం వేగంగా శ్వాస తీసుకోవటం. అందుకని మీ శ్వాసను శ్రద్ధగా పరిశీలించండి. ఛాతీ పైకి, కిందకి వెళ్ళటం చూడండి. ఇతర లక్షణాలు జ్వరం, ఒంట్లో బాలేకపోవటం, ఛాతీ నొప్పి.
 7. 2 నెలల వయస్సు కన్నా తక్కువ ఉండే పసిపిల్లలు నిమిషానికి 60 సార్లు శ్వాస తీసుకుంటుంటే , తప్పనిసరిగా వేగంగా హెల్త్ వర్కర్ దగ్గరకు తీసుకెళ్ళాలి! 1-5 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లల్లో 20-30 సార్లు నిమిషానికి శ్వాస ఉంటే అది వేగవంతమైన శ్వాస అని అర్థం.
 8. మంచి ఆహారం (తల్లిపాలు తాగే బేబీలకి కూడా), పొగ తాగని, రాని ఇళ్ళు, సరైన టీకాలు న్యుమోనియా లాంటి తీవ్ర జబ్బులను నివారిస్తాయి.
 9. దగ్గు లేదా జలుబును తరచూ వేడిగా ఉండే, రుచికరమైన డ్రింక్స్ (సూప్ ఇంకా జ్యూస్)తాగుతూ, విశ్రాంతి తీసుకోడం, ముక్కును శుభ్రంగా ఉంచుకుంటూ నయం చేయండి.
 10. దగ్గు, జలుబులు, ఇతర వ్యాధులను ఒకరినుంచి మరొకరికి అంటుకునేలా చేయటం ఆపండి. చేతులు, తినే, తాగే వస్తువులు శుభ్రంగా ఉంచండి,దగ్గును పేపర్లోకే దగ్గండి.

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

దగ్గులు, జలుబులు & జబ్బులు ; పిల్లలు ఏం చేయగలరు?

 • జలుబులు, దగ్గులు ఇంకా జబ్బుల గురించి మన సందేశాలను మనమే మన సొంత భాషలో, సొంత పదాల్లో తయారుచేసుకుందాం!
 • ఈ సందేశాలను ఎప్పటికీ మర్చిపోకుండా నేర్చుకుని గుర్తుపెట్టుకుందాం!
 • ఇతర పిల్లలు, మన కుటుంబాలతో కూడా ఈ సందేశాలను పంచుకుందాం!
 • మీ ఇంటి ప్లాన్ తయారుచేయండి. ఎక్కడ సాధారణంగా పొగ వస్తుంది, ఎక్కడ రాదు? ఎక్కడ పొగకి దూరంగా పిల్లలు సురక్షితంగా ఆడుకోగలరు?
 • హానికారక వ్యాధులైన ఆటలమ్మ, కోరింత దగ్గు వంటివాటికి తమ పిల్లలకి వ్యాక్సిన్ టీకాలు ఇప్పించాలని తల్లిదండ్రులను ప్రోత్సహించటానికి పోస్టర్ తయారుచేయండి.
 • న్యుమోనియా గురించి ఒక పాటను రాసి, మీ స్నేహితులు, కుటుంబంతో పంచుకోండి!
 • ఒక దారం, రాయితో పెండ్యులంను తయారుచేసి, దాని సాయంతో మన శ్వాస ఎప్పుడు వేగంగా ఉందో, ఎప్పుడు శ్వాస సాధారణంగా ఉందో కౌంట్ చేయండి. దీనితో మనకేం అర్థమైందో మన కుటుంబాలతో పంచుకోవచ్చు.
 • పిల్లలకి తల్లి పాలివ్వటం గురించి మన సొంత నాటిక రాసుకుందాం.
 • జ్వరం వచ్చినపుడు చల్లగా ఉండటం, చలికాలంలో వెచ్చగా ఉండటం గురించి ఒక నాటిక తయారుచేయండి.
 • టాయిలెట్ వాడిన ముందు, తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవటానికి ఇంట్లో, స్కూలులో సాయంగా ఒక నీరు పడే ట్యాప్ ను తయారుచేయండి.
 • జలుబు, దగ్గుకి దూరంగా ఉండటానికి మీ చేతులని సబ్బు, నీళ్లతో ఎలా కడుక్కోవాలో, సూక్ష్మజీవులు ఎలా వ్యాపించకుండా చేయాలో నేర్చుకోండి.
 • న్యుమోనియా లేదా జలుబు వచ్చినపుడు ఎలాంటి సంఘటనలు జరుగుతాయో నటించి న్యుమోనియా గురించి మనం ఎంత నేర్చుకున్నామో పరీక్షించుకోండి.
 • న్యుమోనియాలో అపాయకరమైన లక్షణాలు ఏంటో అడగండి? ఏం నేర్చుకున్నారో కుటుంబాలతో పంచుకోండి.
 • ఎక్కడ పొగ తాగటం నిషేధించబడిందో అడగండి? మీ స్కూలులో నిషేధం ఉందా లేదా?
 • మనం కొన్నిసార్లు శ్వాస ఎందుకు వేగంగా తీసుకుంటామో అడగండి?మన శ్వాసను గమనించటం ద్వారా వేగంగా శ్వాస తీసుకుంటున్నవారు న్యుమోనియా అపాయకర లక్షణాలు చూపిస్తున్నట్లు గుర్తించవచ్చు.
 • దగ్గు,జలుబులను నయం చేయటానికి కొత్త ఇంకా పాత పద్ధతులు ఏంటో అడగండి?
 • సూక్ష్మజీవులు ఎలా వ్యాపిస్తాయో అడగండి? ద హాండ్ షేకింగ్ గేమ్ ఆడటం ద్వారా నేర్చుకోండి.

టిప్పీ ట్యాప్ గురించి, పెండ్యులం లేదా చేతులు కదిపే ఆట లేదా మరేదైనా సమాచారం కోసం ఇక్కడ సంప్రదించండి. www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.

తెలుగు (Telugu) Home