పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

టాపిక్ 3 పై 10 సందేశాలు ఇవిగో ; రోగనిరోధకత అందివ్వటం

 1. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిలియన్ల మంది తల్లిదండ్రులు ప్రతి సంవత్సరం తమ పిల్లలు బలంగా, వ్యాధుల నుంచి రక్షణ పొందటం కోసం టీకా వ్యాక్సిన్ అందివ్వటానికి తీసుకెళ్తారు.
 2. మీకు అంటువ్యాధి సోకి జబ్బుపడినప్పుడు, కన్పించని సూక్ష్మజీవులు శరీరంలోకి చేరి, మరింతగా మారి శరీరం సరిగా పనిచేయదు.
 3. మీ శరీరంలో ప్రత్యేక సైనికుల్లాంటి రక్షకులు ఉంటారు వారిని యాంటీబాడీస్ అంటారు. ఇవి సూక్ష్మజీవులతో పోరాడతాయి. సూక్ష్మజీవులు చచ్చిపోతే, యాంటీబాడీస్ శరీరంలో ఉండి మళ్ళీ పోరాడటానికి రెడీ అవుతాయి.
 4. వ్యాధి టీకాలు యాంటిజెన్లను శరీరంలో ప్రవేశపెడుతుంది (ఇంజెక్షన్ లేదా నోటి ద్వారా). అవి మీ శరీరానికి సైనికుల్లాంటి యాంటీబాడీస్ ను తయారుచేసి వ్యాధులతో పోరాడేలా శిక్షణనిస్తాయి.
 5. కొన్నిసార్లు ఈ టీకాలను శరీరానికి ఒకసారి కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తుంది, దీనివల్ల శరీరం వ్యాధికి వ్యతిరేకంగా సరిపోయే యాంటీబాడీస్ తయారుచేసుకునేందుకు శక్తి లభిస్తుంది.
 6. తీవ్ర వ్యాధులు ప్రాణాంతకంగా మారి చావుకి, చాలా బాధకి దారితీయవచ్చు, ఆటలమ్మ, క్షయ,ఢిఫ్తీరియా, కోరింత దగ్గు,పోలియో,ధనుర్వాతం (ఇంకెన్నో!) వ్యాధులు టీకా వ్యాక్సిన్ల ద్వారా నివారించబడతాయి.
 7. మీ శరీరాన్ని రక్షించటానికి, వ్యాధి వచ్చేముందే మీరు వ్యాక్సిన్ తో రోగనిరోధకత పెంచుకుని ఉండాలి.
 8. పిల్ల్లల్ని వ్యాధుల నుంచి రక్షించటానికి పసిపిల్లలకి వెంటనే వ్యాక్సిన్లు ఇస్తారు, ఒకవేళ భవిష్యత్తులో వారు వ్యాక్సిన్ మిస్సయినా పుట్టినవెంటనే ఇవ్వటంతో కొంతవరకు రోగనిరోధకత పనిచేస్తుంది.
 9. పిల్లలకి వివిధ రోగాలకి, వివిధ సమయాలలో ఈ రోగనిరోధక వ్యాక్సిన్లను ఇవ్వవచ్చు. మీ చుట్టుపక్కల ఎక్కడ, ఎప్పుడు పిల్లలకి టీకాలు వేస్తున్నారో తెలుసుకోండి.
 10. మీ పాపాయిలు లేదా పసిపిల్లలు టీకాలు వేసే రోజు కొంచెం బాగాలేకపోయినా కూడా వ్యాక్సిన్ టీకాలు వేయవచ్చు.

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

నీళ్లు మరియు పారిశుధ్యం – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి నీళ్లు మరియు పారిశుధ్యం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • మన చేతులను ఏ రకంగా శుభ్రంగా వుంచుకోవాలో నేర్పునటువంటి ఒక పాటను నేర్చుకోండి
 • శుభ్రమైన కుటుంబం క్రిముల కుటుంబం వుండే ఊరి లోకి వచ్చినపుడు క్రిముల కుటుంబానికి ఏమవుతుందో తెలిపే నాటికగాని లేదా క్రిములు ఎక్కడ దాక్కుంటాయో తెలిపే నాటిక గాని ఒకటి తయారు చేసి మరియు ఆడి చూపండి
 • మన తమ్ముళ్లు మరియు చెల్లెళ్లు చేతులు శుభ్రంగా ఎలాగ కడుక్కోవాలో తెలుసుకొనేటట్లు వారికి సహాయ పడండి
 • ఒక గుంపులో వున్న మనుషులు ఒక గంటలో ఎన్ని సార్లు వారు తమ తమ ముఖాలను, దుస్తులను, ఇతరులను ముట్టుకుంటున్నారో గమనిస్తూ, ఆ వివరాలను ముద్రితం చేయండి
 • క్రిములు చేతి నుండి శరీరం లోకి విస్తరించే మార్గాలన్నిటి గురుంచి ఆలోచించండి
 • పాఠశాలలోని మూత్రశాలలు శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
 • వడపోత ద్వారా నీటిని శుభ్రపరచడం నేర్చుకోండి
 • పాఠశాల పరిసరాలు చెత్తలేకుండా శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
 • పాఠశాల్లో ఒక ఆరోగ్య సంఘాన్ని స్థాపించండి
 • క్రిములు, ఈగలు, మురికి ల గురించి మనకు తెలిసినదంతా మన కుటుంబాలతో పంచుకోండి
 • నీటి కుండను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు మూత పెట్టి ఉంచండి. ఎల్లప్పుడూ గరిట వాడండి. చేతిని వాడకండి. మన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కుండా నుండి నీటిని ఎలా తీయాలో చేసి చూపండి
 • టిప్పి ట్యాప్ ను అందరు కలసి తయారు చేయండి
 • సబ్బును పట్టి ఉంచడానికి వాష్ మిట్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
 • కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛును ప్లాస్టిక్ సీసా మరియు కొంత పంచదార నీటితో తయారు చేయండి
 • సూర్యకాంతి ని ఉపయోగించి ఇంటిలో తాగే మంచి నీటిని తయారు చేయడంలో సహాయపడండి
 • ఇసుక వడపోతను ఉపయోగించి మురికి నీటిని శుభ్రం చేయండి
 • తడి వంట పాత్రలు, పళ్ళాలు ఎండలో పొడి అయ్యేందుకు వీలుగా అరలను తయారు చేయండి
 • మన చేతులను క్రిములనుండి శుభ్రంగా ఎలా వుంచగలమో అడగండి. మన ఇంటిలో చేతులు కడుగుకోవడానికి సబ్బు వుందా? స్థానిక దుకాణంలో సబ్బు ధర ఎంత? మన శరీరాలను శుభ్రంగా ఎలా ఉంచుతాం? మన పళ్ళను ఎలా శుభ్రం చేసుకుంటాం? క్రిములు ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా వ్యాపిస్తాయి? కీటకాలు ఏమి తింటాయి, ఎలా బతుకుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి? కీటకాలు తమ కాళ్ళ ద్వారా ఎలా మురికి వ్యాపింపచేస్తాయి? మన నీటి వనరులు ఏవి? మురికి నీటిని ఏ విధంగా తాగడానికి అనుకూలంగా మార్చవచ్చు? ప్లాస్టిక్ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలాంటి గుడ్డను నీటి వడపోతకు ఉపయోగించొచ్చు? వంట తయారు చేయునప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు అనుసరిస్తారు? ఇంటిలో లేదా మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలు కీటకాలు ఎక్కువగా ఉండటానికి అనువైనవి?

మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.

తెలుగు (Telugu) Home