పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం4 :మలేరియా (చలి జ్వరం) మీద పది సూచికలు

 1. చలి జ్వరం దోమ కాటు వలన వ్యాపిస్తుంది
 2. చలి జ్వరం ప్రమాదమైనది. దీని వలన ముఖ్యంగా చిన్నపిల్లలకు మరియు గర్భవతులకు జ్వరం వచ్చి మరణం కూడా సంభవించవచ్చు
 3. దోమలను చంపే క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరల కింద పడుకొని దోమ కాట్లనుండి కాపాడుకోండి
 4. చలి జ్వరం కలిగించే దోమలు సాధారణంగా సూర్యాస్తమయం నుండి సూర్యోదయం లోపల కుడతాయి
 5. చలి జ్వరం బారిన పడిన పిల్లలలో అభివృద్ధి చాలా నెమ్మదిగా వుంటుంది
 6. దోమలను చంపే క్రిమి సంహారకాలను మూడు రకాలుగా పిచికారీ చేయవచ్చు : ఇళ్లలో, గాలిలో, నీటి మీద
 7. తీవ్రమైన జ్వరం, తలనొప్పి, కండరాల మరియు కడుపు నొప్పి మరియు వణుకు చలిజ్వరానికి గుర్తులు. వేగవంతమైన పరీక్షలు, చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చు
 8. ఆరోగ్య సహాయకుడు సూచించిన మందుల ద్వారా చలిజ్వరం రాకుండా లేదా తగ్గునట్లు చూడవచ్చును
 9. చలిజ్వరం సోకిన వ్యక్తి రక్తం లో వుండి, రక్త హీనత కలుగచేసి, వారిని బలహీనులుగా చేస్తుంది
 10. చలిజ్వరం వ్యాపించి వున్న సంఘాలలో, మందుల ద్వారా చలిజ్వరం మరియు రక్త హీనతను తగ్గించుట లేదా రాకుండా చేయవచ్చును

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

చలిజ్వరం – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి చలిజ్వరం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • చలిజ్వరం ఎలా వ్యాపిస్తుందో, దానిని మనం ఎలా ఎదుర్కోవచ్చో ఇతరులకు తెలిసేలా పత్రికలు ముద్రించండి
 • దోమల జీవిత చక్రం గురించి కధలు లేదా నాటికలు తయారు చేసి పిల్లలకు వినిపించండి
 • క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలను ఎలా ఉపయోగించాలో తెలుపుతూ పత్రికలను ముద్రించండి
 • దోమకాటునుండి ఎలా తప్పించుకోవచ్చో తెలుపుతూ కధలు చెప్పడం, పత్రికలు ముద్రించడం చేయండి
 • చలిజ్వరం గుర్తులను పిల్లలు ఎలా గుర్తించగలరో తెలుపుతూ కధలు లేదా నాటికలు తయారుచేయండి
 • ఇతర పిల్లలలో చలిజ్వరం గుర్తులను పిల్లలు ఎలా గుర్తించగలరో మరియు పెద్దలను వారిని పరీక్షలకు తీసుకెళ్లమని అడగగలరో తెలుపుతూ కధలు లేదా నాటికలు తయారుచేయండి
 • చలిజ్వరం మరియు రక్తహీనతల గుర్తుల మీద కధలు, నాటికలు రాయండి. పురుగుల వలన మరియు చలిజ్వరం వలన రక్తహీనత ఏ విధంగా కలుగుతుందో తెలపండి
 • మన సంఘంలో దొరికే ఐరన్ ఎక్కువ వుండే పదార్థాలమీద పత్రిక ముద్రించండి
 • దోమలు కుట్టే సమయంలో పిల్లలు దోమ తెరలలోనే ఉండేటట్లు సహాయ పడండి
 • దోమ తెరలు చిరుగులు లేకుండా సరైన విధంగా కట్టబడి వున్నట్లు నిశ్చయించుకోండి
 • ప్రజలు ఎందుకు దోమ తెరలంటే ఇష్టపడతారో / ఇష్టపడరో, దోమ తెరల వలన ఏ ఏ ఉపయోగాలుంటాయనుకుంటున్నారో తెలుపుతూ కధలు, నాటికలు తయారుచేయండి
 • దోమ తెరలను ఎలా ఉపయోగించాలో వివరిస్తూ ప్రచారం చేయండి
 • ఒక ఆరోగ్య సహాయకుని పాఠశాలకు రప్పించి పెద్ద పిల్లలకు దోమ తెరల గురించి మరియు పరీక్షల గురించి బోధపరచమనండి
 • పాటల ద్వారా, నృత్యాల ద్వారా, నాటికల ద్వారా ఇతరులకు సమాచారాన్ని చేరవేయండి
 • మన కుటుంబలో ఎంతమందికి చలిజ్వరం వచ్చిందో అడగండి. మనం చలిజ్వరాన్ని ఎలా అరికట్టవచ్చు? ఎక్కువకాలం మన్నే క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలను ఎలా ఉపయోగించాలి? కిటికీ తెరలు ఏ విధంగా పనిచేస్తాయి? వాటిని ఎలా ఉపయోగించాలి? మన సంఘంలో క్రిమి సంహారికలనుపయోగించిన దోమ తెరలు ఎప్పుడు లభ్యమవుతాయి? చలిజ్వరం ఏ విధంగా ప్రాణాంతకం? గర్భవతులకు, చిన్నపిల్లలకు చలిజ్వరం ఎందుకు ఎక్కువ ప్రమాదకరం? ఆరోగ్య సహాయకులు అప్పుడే పుట్టిన బిడ్డలు కల తల్లులకు చలిజ్వరం రాకుండా ఏమి ఇస్తారు? ఇనుము ఎక్కువ కలిగిన ఆహారాలు (మాంసం, కొన్ని రకాల ధాన్యాలు, పచ్చని ఆకుకూరలు) రక్తహీనతను ఎలా పారదోలుతాయి? దోమ కాట్ల నుండి ప్రజలు తమని, ఇతరులని ఎలా కాపాడుకోగలరు? చలిజ్వరం రక్తంలో ఉందో లేదో తెలుసుకొనుటకు చేసే పరీక్షలేమిటి?

మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.

తెలుగు (Telugu) Home