పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం 5 :అతిసారం మీద పది సూచికలు

 1. అతిసారం సోకినప్పుడు నీళ్ల విరేచనాలు రోజుకు మూడు నాల్గు సార్లు అవుతాయి
 2. కలుషితమైన ఆహారం లేదా నీటి లో వుండే సూక్ష్మ క్రిములు నోటిద్వారా ప్రవేశించడం వల్ల, మురికి వేళ్ళతో నోటిని ముట్టుకొనడం వల్ల లేదా అపరిశుభ్రమైన గిన్నెల వల్ల అతిసారం కలుగుతుంది
 3. నీరు, లవణాలు ఎక్కువ పోవుట వలన శరీరం నీరసిస్తుంది. ద్రవాలను వెంటనే తీసుకొనకపోతే చిన్నపిల్లలు నిర్జలీకరణ వల్ల మరణించే ప్రమాదముంది
 4. శుభ్రమైన నీరు, కొబ్బరి నీరు, గంజి ఇవ్వడం ద్వారా అతిసారాన్ని అరికట్టవచ్చు. శిశువులకు తల్లి పాలు అన్నిటికంటే ముఖ్యం
 5. అతిసారం సోకిన పిల్లలలో పిడచకట్టిన నోరు, నాలిక, గుంటలు పడిన కళ్ళు, కన్నీళ్లు లేకపోవుట, వదులైన చర్మం, చల్లని చేతులు, పాదాలు కలిజి ఉంటాయి. కొంతమంది శిశువులలో తలమీద గుంటలు పడిన మెత్తటి ప్రదేశం ఏర్పడుతుంది
 6. రోజుకు అయిదు సార్లు కంటే నీళ్ల లేదా రక్త విరేచనాలు చేసుకొను లేదా వంతులుచేసుకొను పిల్లలను వెంటనే ఆరోగ్య సహాయకులకు చూపించాలి
 7. ఓఆర్ఎస్ అంటే ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్. ఓఆర్ఎస్ దొరికే దుకాణాలు, ఆసుపత్రులు ఎక్కడున్నాయో తెలుకోండి. దానిని శుభ్రమైన నీటిలో సరైన మోతాదులో కలుపుకొని అతిసారం తగ్గించే ద్రవాన్ని తయారుచేయండి
 8. మందులేవీ అతిసారానికి పనిచేయకపోవచ్చు. కానీ 6 నెలలు నిండిన పిల్లలకు జింక్ మాత్రలు అతిసారాన్ని తగ్గిస్తాయి. ఓఆర్ఎస్ ద్రవం కూడా ఇవ్వవలెను
 9. అతిసారం సోకిన చిన్న పిల్లలకు రుచికరమైన, ముద్ద చేసిన ఆహారాన్ని ఎక్కువసార్లు ఇస్తూ ఉండాలి
 10. పిల్లలకు చనుబాలు ఇవ్వడం ద్వారా, మంచి ఆరోగ్య అలవాట్ల ద్వారా, నిరోధిక శక్తినిచ్చు మందుల ద్వారా, సుక్షితమైన ఆహారం ద్వారా అతిసారాన్ని అరికట్టవచ్చు

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

అతిసారం – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి అతిసారం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • అతిసారం యొక్క ప్రమాదకరమైన గుర్తులు ఇతరులకు తెలిసేటట్లు పత్రికలూ వేయండి
 • ఆరోగ్య సహాయకుని ఎప్పుడు పిలవాలో తెలుపుతూ ఒక నాటిక రాయండి
 • అతిసారాన్ని అరికట్టడమెలాగో తెలిసేటట్లు పాము నిచ్చెన ఆటను రూపొందించండి
 • ఇళ్లలోనూ, పాఠశాలలోనూ ఓఆర్ఎస్ కలిగి వున్నా ప్రధమ చికిత్స డబ్బాలను తయారుచేయండి
 • ఇద్దరు తల్లులు తమ పిల్లలను అతిసారం నుండి ఏ విధంగా రక్షిస్తున్నారో మాట్లాడుకొనునట్లు ఒక నాటిక రాయండి
 • అతిసార గుర్తులు మనకు ఎంత తెలుసో తెలుసుకొనుటకు ఒక ఆటను తయారుచేయండి
 • మొక్కలు పెరగడానికి నీరు ఎంత అవసరమో గమనించండి. మొక్కలకు నీళ్లు లేకపోతే ఏమవుతుందో తెలుసుకోండి
 • మనం నివసించే ప్రదేశాలను, మనను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా అతిసారాన్ని అరికట్టండి
 • సూక్ష్మ క్రిములు ఎంత వేగంగా వ్యాప్తి చెందుతాయో తెలిపే కరచాలన ఆటను తయారు చేయండి
 • మన తల్లులు ఎంత వరకు చనుబాలు ఇచ్చారో అడగండి. ఓఆర్ఎస్ మరియు జింక్ తో అతిసారాన్ని ఎలా అరికట్టొచో అడగండి. ఏ ఏ ప్రమాద సూచికలప్పుడు మనం ఆరోగ్య సహాయకుల సహాయం తీసుకోవాలి? మనకు అతిసారం వున్నప్పుడు ఏ ఏ ద్రవపదార్థాలు మంచివి? సూర్యకాంతినుపయోగించి మన తాగే నీటిని ఏ రకంగా సురక్షితంగా చేసుకోవచ్చు? మనకు ఎటువంటి ఓఆర్ఎస్ లేనపుడు ఎటువంటి ద్రవాలు మంచివి? జిగట విరేచనాలు, కలరా అంటే ఏమిటి? అవి ఎలా వ్యాప్తి చెందుతాయి?

ఫ్లై ట్రాప్, కరచాలన ఆట, సూర్యకాంతితో నీటిని సురక్షితం చేయు విధానం మొదలగు వాటి గురించి మరింత సమాచారం కొరకు www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి

తెలుగు (Telugu) Home