పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం 7 : న్యూట్రిషన్ మీద పది సూచికలు

 1. మన శరీరం చలాకీగా ఉండటానికి, పెరగడానికి, కాంతివంతంగా ఉండటానికి ఉపయోగ పడే ఆహారం మన శరీరానికి చాలా అవసరం
 2. తక్కువగా తినడం, చెత్త ఆహారం తీసుకొనడం పోషకాహార లోపానికి కారణాలు. సరైన మోతాదులో మంచి ఆహారాన్ని భోజనంలో తీసుకొనుట ద్వారా దానిని అరికట్టండి
 3. రెండేళ్ల లోపు పిల్లలు సరిగా పెరుగుతున్నారా లేదో తెలుసుకొనుటకు వారిని ప్రతి నెలా పిల్లల ఆసుపత్రిలో బరువు చూపిస్తూ ఉండాలి
 4. పిల్లలు సన్నగా వున్నా, ముఖం, పాదాలు పొంగి వున్నా, నిశ్చలంగా వున్నా వారిని ఆరోగ్య శిక్షణనిచ్చు వారికి చూపించాలి
 5. అనారోగ్యంగా వున్నపుడు పిల్లలలో ఆకలి ఉండదు. వారు ఆరోగ్యవంతులవుతున్నప్పుడు, వారికి ఎక్కువ మోతాదులో పులుసు, ఆహారం ఇవ్వండి
 6. పుట్టినప్పటినుండి ఆరు నెలల దాకా చను పాలు మాత్రమే పిల్లలకు కావాలి.
 7. ఆరు నెలలు దాటినా తర్వాత పిల్లలకు ముద్దగా చేసిన ఆహారంను రోజుకు మూడు నుండి నాలుగు సార్లు ఇస్తూ, మధ్య మధ్య లో అల్పాహారాన్ని కూడా ఇవ్వాలి
 8. వివిధ రకాలైన సహజ ఆహారాన్ని ప్రతీ వారం ఇవ్వడం వలన సమతూకంగా ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది
 9. ఎరుపు, పసుపు మరియు ఆకుపచ్చ పళ్ళు, కూరగాయలలో అధిక పోషణాలు ఉంటాయి. ఇవి మన శరీరాన్ని శక్తివంతంగా ఉంచుతాయి
 10. మీరు తినే ఆహారాన్ని ఉడికించి ముందు కడుగుట వలన అనారోగ్యం పాలవరు. ఉడికించిన ఆహారాన్ని వెంటనే భుజించండి లేదా సరిఅయిన పద్దతిలో భద్రపరచండి

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

న్యూట్రిషన్ – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి న్యూట్రిషన్ పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • వృద్ధి పట్టికను ఇతర పిల్లలతో మరియు పెద్దవారితో కలసి చూసి దానిలో ఉన్న గీతల అర్ధాన్ని తెలిసుకునేట్టు పని చేయండి. ఈ వృద్ధి పట్టికనే ఆరోగ్య మార్గ పట్టిక అని కూడా పిలుస్తారు. ఇది మీ ఆరోగ్య కేంద్రంలో ఉంటుంది
 • మీ దగ్గర లో వున్న ఆరోగ్య కేంద్రంకి వెళ్లి పిల్లల బరువు తూచే విధానం, వృద్ధి పట్టికలో నమోదు చేసే విధానం తెలుసుకోండి
 • ఆరోగ్య కేంద్రాల్లో పిల్లల బరువు తూచే విధానం చూసి తెలుసుకోండి
 • వారికి తెలిసిన పిల్లలలో ఎవరైనా పోషకాహార లోపం తో బాధపడుతున్నారా, వారికి ఎలాంటి సహాయం అందిస్తున్నారు అని చర్చించండి
 • మన కుటుంబ సభ్యులు ప్రతి రోజు/ ప్రతి వారం ఏమి తింటున్నారు? మనం ప్రతి వారంలో ఎన్ని సహజ రంగుల కూరగాయలు తింటున్నాము ? మన కుటుంబ సభ్యులందరికి చలాకీగా ఉండటానికి, ఎదుగుదలకు, కాంతివంతంగా ఉండటానికి సరిపడినంత ఆహారం దొరుకుతోందా? మనకి ఈ వివరాలు ఎలా తెలుస్తాయి? ఎవరైనా పెద్దవారు లేదా చిన్నవారు తక్కువ తింటూ మనం వారిపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందా
 • ఏ ఏ సమయాలలో మనం తినే ఆహరం వల్ల అనారోగ్యం పాలవుతామో అడిగి తెలుసుకోండి
 • ఒక పిల్లవాడు పోషకాహార లోపంతో బాధపడుతున్నాడని తల్లిదండ్రులకి, ఆరోగ్య కార్మికుడికి, ఇతరులకు ఏ విధంగా తెలుస్తుందో తెలుసుకోండి
 • ఏ ఏ ఆహరం శిశువులకు, పిల్లలకు హాని చేస్తుందో ఒక బొమ్మ గీసి, ప్రతి ఆహరం బొమ్మ పక్కన అది ఏ విధంగా హాని కలిగిస్తుందో తెలపండి
 • ఆరు నెలలు నిండిన పిల్లలకు వారి తల్లులు మొదటగా ఇచ్చే ఆహారమేదో అడిగి తెలుసుకోండి. తమ పిల్లలకు ఏ ఏ సమయాలలో ఆహారం ఇస్తారు? దాని ఫలితాలు ఎలా వున్నాయో ఒక చోట రాసుకుని ఆ వివరాలను తర్వాత తమ స్నేహితులతో పంచుకొనవచ్ఛు
 • తమ ప్రాంతాలలో విటమిన్ తో కూడిన ఏ ఏ ఆహరం దొరుకుతుంది? వాటిని ఇళ్లల్లో/ దుకాణాలలో ఎలా తయాఋ చేస్తారు తెలుసుకోండి
 • ఏ విధంగా ఆహారం తయారు చేస్తున్నారు? పళ్ళాలు, పాత్రలు ఏ విధంగా కడుగుతున్నారు, వంట వండే వారు వండేటప్పుడు చేతులను ఏ విధంగా శుభ్రం చేసుకుంటున్నారు మొదలగునవి గమనించండి
 • ఒక వారంలో మనం ప్రతి రోజు తినే ఆహారం యొక్క చిత్రాలను గీసి వాటి గురుంచి రాయండి. ఈ చిత్రాలకు రంగులు చేర్చవచ్చు.
 • ఆరు నెలలు నిండిన పిల్లలకు వారి తల్లులు మొదటగా ఇచ్చే ఆహారమేదో అడిగి తెలుసుకోండి. వాటి సమాధానాలను ఒక చోట రాసుకుని ఆ తర్వాత వాటి చిత్రాలను వారి స్నేహితుల సహాయంతో గీయండి
 • శిశువులకు, పిల్లలకు ఏ ఏ ఆహారం మంచిది లేదా చెడ్డది తెలుసుకోండి. ఈ ఆహారాల వివరాలతో చిత్రాలను గీయవచ్చు
 • ఒక శిశువు సరిగా పెరుతోందో లేదో తెలుసుకొనుటలో వృద్ధి పట్టిక ఎలా ఉపయోగపడుతుందో అడిగండి. ఒక ఆహారాన్ని ఏ విధంగా పొడిగా, తాజాగా వుంచుతున్నారో అడిగి తెలుసుకోండి. సహజ రంగులతో కూడిన ఆహారాన్ని తీసుకోవడంయొక్క అవసరాన్ని అడగండి. అనారోగ్యంగా వున్నప్పుడు, అనారోగ్యం తగ్గిన వెంటనే తీసుకోవలసిన ఆహారమేమిటో అడగండి
 • చనుబాలు యొక్క ప్రాముఖ్యత ఆరోగ్య కార్మికులను అడిగి తెలుసుకోండి
 • అనారోగ్యంగా వున్న పిల్లలకు సరైన ఆహారం / ద్రావకం ఇవ్వడంలో మనం ఏ విధంగా సహాయ పడగలమో అడగండి
 • మన ప్రాంతంలో/ మన స్నేహితులతో ఏ ఏ తల్లులు చనుపాలు పడుతున్నారో మరియు ఎందుకు పడుతున్నారో తెలుసుకోండి. శిశువులు పెరుగుతున్నపుడు ఏ రకంగా ఆహార అలవాట్లు మార్చాలో తెలుసుకోండి. సీసా పాలు ఏ విధంగా శిశువుల ఆరోగ్యానికి హానికరమో తెలుసుకోండి
 • ఆహారం పాచిపోయి తినడానికి పనికిరాకపోయినపుడు ఏ విధంగా తెలపాలో, పిల్లలు తమ సహోదరుల ద్వారా మరియు ఇతరుల ద్వారా తెలుసుకోవచ్ఛును

మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.

తెలుగు (Telugu) Home