పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం 8 : ప్రేగు క్రిములు

 1. లక్షల సంఖ్యలో వున్న పిల్లల శరీర భాగాలలో క్రిములు ఉంటాయి. మనం ఆహారం చేరే శరీర భాగమైన ప్రేగులలో ఈ క్రిములు ఉంటాయి
 2. వేరు వేరు రకాల క్రిములు మన శరీరంలో ఉంటాయి
 3. క్రిములు మానను అనారోగ్యం పాలు చేస్తాయి. వాటి వలన మనకు కడుపు నొప్పి, దగ్గు, జ్వరం మొదలగు అనారోగ్యాలు కలుగుతాయి
 4. క్రిములు మన శరీరంలో ఉండటం వల్ల అవి ఉన్నట్టు మనకు సాధారణంగా తెలియదు. కానీ అప్పుడప్పుడు అవి మన మలం లో కనిపించవచ్చు
 5. క్రిములు వాటి గుడ్లు మన శరీరంలోకి వివిధ మార్గాల ద్వారా చేరుతాయి. కొన్ని మనం తినే ఆహారం ద్వారా, మనం తాగే కలుషితమైన నీటి ద్వారా, కొన్ని పాదాల ద్వారా చేరుతాయి
 6. క్రిములను క్రిమి సంహారిణి ద్వారా తొలగించడం చాలా సులభం మరియు చౌకైనది. ఆరోగ్య కార్మికులు వీటిని 6 లేదా 12 నెలలకొకసారి లేదా కొన్ని క్రిముల కోసం అంతకంటే ఎక్కువ మోతాదు లో ఇస్తారు
 7. క్రిముల మల మూత్రాలలో ఉంటాయి. సౌచాలయాలను ఉపయోగించండి లేదా మల మూత్రాలను సురక్షితంగా తొలగించండి. మల మూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం మరియు పిల్లలకు నేర్పడం ద్వారా మన చేతులలో క్రిముల గుడ్లు చేరవు
 8. మల మూత్ర విసర్జన తర్వాత చేతులను సబ్బుతో కడుక్కోవడం ద్వారా, తినే ముందు కాయగూరలను , పళ్ళను కడగడం ద్వారా మరియు చెప్పులను వేసుకొనుట ద్వారా క్రిములు మీ శరీరంలోకి ప్రవేశించకుండా అరికట్టవచ్చు
 9. కొన్ని క్రిములు మట్టిలో ఉంటాయి. కాబట్టి మట్టిని ముట్టుకొనిన ప్రతీసారి శుభ్రంగా కడుక్కోండి
 10. పళ్ళను కాయగూరలను తినే ముందు కడిగే నీటిలో మల మూత్రాలు కలువట్లేదని నిర్ధారణ చేసుకోండి

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

ప్రేగు క్రిములు – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి ప్రేగు క్రిములు పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • “మీ పాదాలతో ఓటు వేయండి” ద్వారా ప్రశ్నల పరీక్షను పెట్టి వారికి క్రిముల గురించి ఎంత తెలుసో తెలుసుకోండి
 • క్రిముల గురుంచి ఒక కథను వినుట ద్వారా వాటిని అరికట్టడం ఎలాగో తెలుసుకోండి
 • మన పాఠశాలలో ఆహారం ఎలా తయారు చేస్తారు, వంటివారు ఆ ఆహారాన్ని క్రిములు లేకుండా ఎలా భద్రపరుస్తారు తెలుసుకోండి
 • మట్టిలోనూ నీటిలోనూ ఉండే క్రిములు వ్యాప్తి చెందకుండా ఉండటానికి మల మూత్ర విసర్జనకు ఎల్లప్పుడూ సౌచాలయాన్నే వాడండి
 • మన చేతులను శుభ్ర పరుచుకోవడానికి నీటిని, సబ్బును, శుభ్రమైన గుడ్డను వాడండి
 • మన కుటుంబంలో వారికి క్రిముల గురుంచి ఎంత తెలుసో తెలుసుకోండి
 • చెడ్డ క్రిములు గురించి తెలుపుతూ, చెడ్డ క్రిములు తమ కుటుంబ సభ్యుల ఆహారాన్ని దొంగిలించకుండా పిల్లలు ఏ విధంగా అడ్డుకున్నారో తెలుపుతూ ఒక రాయండి
 • ఆహారాన్ని కడగటం ద్వారా, మాంసాన్ని ఉడకపెట్టడం ద్వారా ఆహారాన్ని క్రిముల నుండి ఏ రకంగా సురక్షితంగా వుంచచ్చొ తెలుపుతూ పత్రికలు వేయండి
 • మన కుటుంబం, మన తరగతి కొరకు “టిప్పి ట్యాప్” మరియు చేతులు కడుగుకొనే ప్రదేశం ఎలా తయారుచేయవచ్చొ తెలుసుకోండి
 • క్రిముల వ్యాప్తి అరికట్టే విధానమెట్టిదో లేదా చేతులు కడిగే విధానం మనకి గుర్తు చేసేట్టు ఒక పాట రాయండి
 • మనం కూరగాయలు తినే ముందు లేదా వండే ముందు వాటిని కడగవలసిన అవసరం మనకు తెలుపుతూ ఒక పత్రికను ముద్రించండి
 • క్రిముల వ్యాప్తి అరికట్టే విధానం తెలుపుతూ ఒక నాటిక లేదా ఒక తోలు బొమ్మలాట ను తయారు చేయండి
 • క్రిముల గురుంచి మనకి తెలిసినది గుర్తించుటకు ఒక నాటికను గాని ఖాళీలు పూరించు ఒక పదకేళి ని గాని తయారు చేయండి లేదా ఎప్పుడు మనం చేతులు కడుగుకోవాలో తెలిపే ఒక ప్రశ్నల పరీక్ష ను తయారు చేయండి
 • మనం తినే ఆహారాన్ని మన శరీరం ఎలా ఉపయోగించుకొంటుంది? పెద్ద ప్రేవు ఎంత పొడుగు ఉంటుంది? క్రిములు మన ఆహారాన్ని ఎలా తీసుకొంటాయి? ఆంత్ర పరాన్న జీవ క్రిమి ఎంత పొడుగు పెరుగుతుంది? ఎన్ని రకాల క్రిములు మీకు తెలుసు? మీరు నివసించే ప్రదేశంలో ఏ క్రిములు ఎక్కువగా ఉంటాయి? వాటి గుర్తులేంటి? క్రిమి సంహారిక ద్రావకం ఎక్కడ దొరుకుతుంది మరియు దానిని ఎవరు తీసుకోవాలి? ఒక క్రిమి ఎన్ని గుడ్లు పెడుతుంది? క్రిములు మన ఇతర ఆహారాలతో బాటు విటమిన్-ఎ కూడా మన శరీరం నుండి తీసుకొంటాయి. విటమిన్-ఎ మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? క్రిముల పిల్లలను లార్వా అంటారు. ఏ లార్వాలు మన చర్మం ద్వారా మన శరీరంలోకి ప్రవేశిస్తాయి?సౌచాలయాలను ఉపయోగించుటవలన లేదా మల మూత్రాలను సురక్షితంగా తొలగించుటవలన క్రిముల వ్యాప్తి ని ఎలా అరికట్టవచ్చు? మన పాథశాలలలో క్రిమిసంహారక దినాలు ఉన్నాయా? అవి ఎప్పుడు? అదే రోజు అందరికి క్రిమి సంహారిక మాత్రలు ఎందుకిస్తారు? ప్రపంచంలో ఎంత మంది పిల్లల శరీరాల్లో క్రిములు ఉన్నాయి? క్రిముల వ్యాప్తి నివారణ ఎందుకు ముఖ్యం? మన జీర్ణ వ్యవస్థ ఎలా పనిచేస్తుంది? క్రిములు దానిపైన ఎలాంటి ప్రభావం చూపుతాయి? మీకు తెలిసిన అతి చిన్న సంగతేది? నీళ్లు శుభ్రంగా ఉన్నాయో మురికిగా ఉన్నాయో ఎలా ?తెలుస్తుంది? మొక్కలు పెరగటానికి ఏమిటి అవసరం? మొక్కలకు సురక్షితమైన ఎరువును ఎలా తయారు చెయ్యాలి?

“టిప్పి ట్యాప్” మరియు చేతులు కడుగుకొనే ప్రదేశంలు తయారు చేసే విధానం, ఖాళీలు పూరించు ఒక పదకేళి గురించి లేదా మరి ఇంకేదైనా వివరాలగురించి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి.

తెలుగు (Telugu) Home