పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

టాపిక్1 పై 10 సందేశాలు ; పసిపిల్లల సంరక్షణ

 1. మీకు ఎంత వీలైతే అంత పసిపిల్లలతో ఆటలు ఆడండి, హత్తుకోని ఉండండి, మాట్లాడండి, నవ్వండి ఇంకా వారికి పాటలు పాడి విన్పించండి.
 2. పసిపిల్లలు, పాపాయిలు సులభంగా కోపం తెచ్చుకుంటారు,భయపడతారు, ఏడుస్తారు ఇంకా వారికి ఏం అన్పిస్తుందో కూడా చెప్పలేరు. అందుకని చిరాకు తెచ్చుకోకండి. ఎప్పుడూ ప్రేమగా ఉండండి.
 3. పసిపిల్లలు వేగంగా నేర్చుకుంటారు ;ఎలా నడవాలి, శబ్దాలు చేయటం, తినడం, తాగడం. వారికి సాయం చేస్తూనే సురక్షితమైన పొరపాట్లను కూడా చేయనివ్వండి!
 4. అమ్మాయిలు,అబ్బాయిలు అందరూ ముఖ్యమే. అందర్నీ ఒకేలాగా, ముఖ్యంగా జబ్బు చేసిన పిల్లలను, వికలాంగులైన పిల్లలను ఒకేలాగా చక్కగా చూడండి.
 5. పిల్లలు తమ చుట్టూ ఉన్నవారిని అన్నిటిలో అనుకరిస్తారు. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా పరిశీలించుకోండి, వారి దగ్గర సరిగ్గా ప్రవర్తించి, వారికి మంచిమార్గాలు చూపించండి.
 6. పసిపిల్లలు ఏడ్చినప్పుడు తప్పక ఏదో ఒక కారణం ఉంటుంది (ఆకలి,భయం, నొప్పి). అది ఎందుకో కనుక్కోండి.
 7. పసిపిల్లలను అంకెలు, పదాల ఆటలు, పెయింటింగ్, బొమ్మలు వేయించటంలాంటివి ఆడించి వారిని బడికి సిద్ధం చేయండి. వారికి కథలు చెప్పండి, పాటలు పాడండి, డ్యాన్స్ చేయండి.
 8. ఒకచోట గ్రూపులాగా, ఒక నోటు పుస్తకంలో పాపాయి, పసిపిల్లలుగా ఎలా ఎదుగుతున్నారో చూస్తూ అందులో రికార్డు చేయండి. వారు చేసిన ‘మొదటి’పనులు మాట్లాడటం, నడవటం వంటివి.
 9. పెద్దవారైన సంరక్షకులు, పెద్దపిల్లలకి సాయం చేస్తూ పసిపిల్లలు,పిల్లలు శుభ్రంగా ఉండేలా చేయండి(ముఖ్యంగా చేతులు,మొహాలు),సురక్షితమైన నీళ్ళు తాగేలా, సరిపోయేంత మంచి ఆహారం తినేలా చేసి వ్యాధులు రాకుండా అరికట్టండి.
 10. పసిపిల్లలకి, పిల్లలకి కావాల్సినంత ప్రేమ, ఆప్యాయత పంచండి కానీ మీ గురించి మర్చిపోకండి. మీరు కూడా ముఖ్యమే.

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

పసిపిల్లల సంరక్షణ ; పిల్లలు ఏం చేయగలరు?

 • మీ సొంత పదాల్లో, మీ భాషలో పసిపిల్లల సంరక్షణ గురించిన సందేశాలను తయారుచేసుకోండి!
 • ఈ సందేశాలను మర్చిపోకుండా చదువుకుని గుర్తుంచుకోండి!
 • ఈ సందేశాలను ఇతర పిల్లలు, మన కుటుంబాలలో కూడా అందరికీ తెలియచేయండి!
 • అబ్బాయిలు, అమ్మాయిలు అని రెండు గ్రూపులుగా విడగొట్టండి; అబ్బాయిలను ‘అమ్మాయిల ఆటలు’, అమ్మాయిలు ‘అబ్బాయిల ఆటలు’ ఆడేలా చూడండి. తర్వాత రెండు గ్రూపులు కలసి కూర్చుని ఈ ఆటల గురించి చర్చించండి. ఉదాహరణకి, కొన్ని ఆటలను ‘అబ్బాయిల లేదా అమ్మాయిల ఆటలు’ అని పిలవటం మీకు నచ్చుతుందా?ఒప్పుకుంటారా? అయితే ఎందుకు?కాకపోతే ఎందుకు కాదు?
 • ఇంట్లో కానీ, స్కూలులో కానీ ‘మంచి’ లేదా ‘చెడ్డ’ ప్రవర్తన అంటే ఏంటో,వాటిని అలా ఎందుకు అంటారో చర్చించండి.
 • మనకి ఈ అంశం గురించి తెలిసినది ఇతరులకి చూపించటానికి పోస్టర్లు తయారుచేయండి.
 • ఇంట్లో,స్కూలులో లేదా కమ్యూనిటీ గ్రూపుల్లో – బొమ్మలను తయారుచేసే పోటీలు నిర్వహించండి, మొబైల్స్, బిల్డింగ్ బ్లాక్స్ తో, నిజం బొమ్మలు, జంతువులు, చిత్రపుస్తకాలు ఏవైనా.
 • సబ్బుతో చేతులు కడుక్కోవటం, రోగనిరోధక వ్యాక్సిన్లు, సమతుల ఆహారం తీసుకోవటం వంటి రోగనివారణకి సింపుల్ పద్ధతులను సూచించే పోస్టర్లను, బొమ్మలనూ గీయండి.
 • చిన్నపిల్లలతో కలిసి ఆడుకునే సంరక్షకులపై చిన్న నాటిక తయారుచేయండి. ఇద్దరు తల్లుల మధ్య సంభాషణగా రాయవచ్చు ; ఒకరు పిల్లలు అల్లరి చేయకుండా బుద్ధిగా ఉండాలనుకునేవారు, మరొకరు పిల్లలన్నాక ఆడుకోవాలి అనుకునేవారు! చేతులతో, ముఖంలో భావాలతో శబ్దంలేకుండా, మాట్లాడకుండా అన్ని డైలాగులు నటింపచేయండి. మిగతా పిల్లలని ఆ భావం లేదా విషయాన్ని గెస్ చేయమనండి.
 • తల్లిదండ్రులని, అమ్మమ్మ/నానమ్మ –తాతయ్యలని పిల్లలు ఎందుకు ఏడుస్తారు,నవ్వుతారని అడగండి. ఏం తెలుసుకున్నారో క్లాసులో పంచుకోండి.
 • ఒక క్లాసు లేదా బృందం స్థానిక ప్రదేశంలో ఉన్న ఒక బేబీని దత్తత తీసుకోవచ్చు. ఆ పాప/బాబు తల్లి ప్రతి నెలా క్లాసు లేదా బృందాన్ని కలిసి తన బేబీ ఎలా పెరుగుతోందో వివరించవచ్చు.
 • పరిశుభ్రంగా ఉండటం, మంచి నీరు తాగటం ద్వారా వ్యాధులను నివారించే సింపుల్ స్టెప్స్ ను వివరించే పాటలను రూపొందించండి, వాటిని ఇంట్లో మీ చెల్లెళ్ళు, తమ్ముళ్ళతో కలిసి పాడండి.
 • పెద్ద పిల్లలు తల్లిదండ్రులను వారి పిల్లలను సంరక్షించటంలో, బాగా చూసుకోటంలో కష్టాలు ఏమిటి, ఏది అన్నిటికన్నా ఎక్కువ సాయపడిందని అడగండి.
 • హెల్త్ వర్కర్ లేదా సైన్స్ ఉపాధ్యాయుడుని బేబీ మెదడు ఎలా పెరుగుతుందో ఇంకా చెప్పమని అడగండి.
 • పెద్ద పిల్లలు తమ ఇంట్లో, చుట్టుపక్కల ముసలివారిని వారికి పాటలు,కథలు, ఆటలు నేర్పించమని అడగవచ్చు. చెల్లెళ్ళకి లేదా తమ్ముళ్ళకి, చిన్నబేబీలకి పాటలు పాడి వినిపించవచ్చు.
 • పిల్లలు పెద్దవారిని బేబీలను వివిధ వ్యాధులు రాకుండా సంరక్షించటం ఎందుకు ముఖ్యమో అడగవచ్చు.

మరింత సమాచారం కోసం ఈ వెబ్ సైట్ లో కాంటాక్ట్ చేయండి www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org.

తెలుగు (Telugu) Home