పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం 10 :హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్

 1. మన శరీరం అద్భుతమైనది. ప్రతీ రోజు అది మనం ముట్టుకునే, త్రాగే, ఊపిరి పీల్చుకొనే సూక్ష్మ జీవుల వల్ల కలుగు జబ్బులనుండి ప్రత్యేక పద్దతులలో కాపాడుతుంది
 2. హెచ్ ఐ వి అనేది వైరస్ (వి అంటే వైరస్) అనబడే ఒక సూక్ష్మ జీవి. ఇవి చాలా ప్రమాదకరమైనవి. వీటి వలన మన శరీరం ఇతర సూక్ష్మ జీవుల నుండి కాపాడుకొనే శక్తి ని కోల్పోతుంది
 3. శాస్త్రవేత్తలు హెచ్ ఐ వి ప్రమాదకరంగా మారకుండా ఉండటానికి మందులు కనిపెట్టారు గానీ, వీటిని శరీరం నుండి పూర్తిగా తొలగించే పద్దతి కనిపెట్టలేదు
 4. హెచ్ ఐ వి సోకి మందులు వాడని వారు కాలం తర్వాత ఎయిడ్స్ బారిన పడతారు. ఎయిడ్స్ అనేది కొన్ని ప్రమాదకర రోగాల సమాహారం. ఇది శరీరాన్ని రోజు రోజుకు చాలా నిరసింపచేస్తుంది
 5. హెచ్ ఐ వి రక్తంలోను, సంభోగ సమయంలో ఊరే ఇతర ద్రవాల్లోనూ కలిసిపోయి కనిపించకుండా ఉంటుంది. హెచ్ ఐ వి (1) సంభోగ సమయంలోనూ, (2) హెచ్ ఐ వి వున్న తల్లులనుండి పిల్లలకు, (3) రక్తం ద్వారా సంక్రమిస్తుంది
 6. సంభోగం ద్వారా హెచ్ ఐ వి సోకకుండా ప్రజలు ఈ కింది విధంగా అరికడతారు (1) సంభోగం లో పాల్గొనకుండా, (2) నమ్మకమైన సాన్నిహిత్యంతో, (3) కండోమ్ ఉపయోగించి సంభోగం జరుపుట ద్వారా
 7. హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ సోకిన వారితో ఆడుకొనవచ్చు, తాకవచ్చు, కౌగిలించుకొనవచ్చు. వీటి వలన హెచ్ ఐ వి సంక్రమించదు
 8. హెచ్ ఐ వి, ఎయిడ్స్ సోకిన వారు భయపడుతూ, విచారంగా ఉంటారు. వారికి, వారి కుటుంబ సభ్యులకు ప్రేమ, సహకారాలు కావాలి. వారు వారి బాధలను ఇతరులతో పంచుకోవాలి
 9. హెచ్ ఐ వి సోకిందని అనుమానమొచ్చిన వారు, వారిని ఇతరులను కాపాడుకొనుటకు ఆరోగ్య కేంద్రానికి సలహాల గురించి, చికిత్స గురించి వెళ్ళాలి
 10. చాలా దేశాలలో హెచ్ ఐ వి సోకిన వారికి సహాయం మరియు చికిత్స అందుతుంది. ఏంటి రెట్రో వైరల్ థెరపీ (ART) అనే మందు వారు ఎక్కువ కాలం జీవించడానికి ఉపయోగపడుతుంది

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ – పిల్లలు చేయగలిగినది ఏమిటి

 • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
 • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
 • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
 • హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ గురించిన వివరాలను సేకరించి అందరితోనూ పంచుకోండి
 • ఆరోగ్య శ్రామికులను పాఠశాలకు ఆహ్వానించి హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ గురించిన అనుమానాలు నివృత్తి చేసుకోండి
 • మన ప్రాంతంలో ఎయిడ్స్ సోకిన పిల్లల సహాయానికి పద్దతులను ఆలోచించండి
 • జీవనాధార ఆటను ఆడుతూ, హెచ్ ఐ వి సోకడానికి గల అవకాశాలను గుర్తించండి
 • హెచ్ ఐ వి సోకే పద్దతులను తెలిపే “నిజమా అబద్ధమా” ఆటను తయారు చేసి ఆడండి. చివరలో సహాయపడటానికి ప్రశ్నలడగండి
 • ప్రత్యేక స్నేహాల గురించి, లైంగిక భావనల గురించి మాట్లాడటానికి అవసరమైన నైపుణ్యాన్ని నేర్పండి
 • మన ప్రత్యేక స్నేహాల ద్వారా హెచ్ ఐ వి సోకకుండా ఉండటానికి అవసరమైన అలవాట్లు తెలిపే “ఫ్లీట్ ఆఫ్ హోప్” ఆటను ఆడండి
 • హెచ్ ఐ వి, ఎయిడ్స్ సోకిన వారి కష్టాలనన్నిటిని తెలుసుకొని వారికి ఏ విధంగా సహాయపడగలమో ఆలోచించండి
 • హెచ్ ఐ వి సోకిన వారిలా నాటిక వేస్తూ, వారి కష్టాలు తెలుసుకోండి
 • హెచ్ ఐ వి సోకిన వారి గురించి వారి కష్టాల గురించి తెలిపే కధలను తెలుసుకోండి
 • హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి మనకు తెలిసిన వివరాలతో ఒక ప్రశ్నావళిని రూపొందించండి
 • హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి ప్రశ్నలకు మన తరగతి గదిలో ఒక ప్రశ్నల పెట్టెను ఉంచండి
 • హెచ్ ఐ వి ఎయిడ్స్ గురించి ఒక పత్రాన్ని మన పాఠశాల కోసం తయారుచేయండి
 • మీనా అను అమ్మాయి లేదా రాజీవ్ అనే అబ్బాయి, హెచ్ ఐ వి సోకిన వారి తల్లి మరియు మీనా తన తల్లిని ఆరోగ్యకేంద్రానికి వెళ్లి ART తీసుకొమ్మని బలవంతపెట్టేటట్టు ఒక నాటికను తయారు చేయండి
 • హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ సంఘాన్ని ఒక దానిని స్థాపించి మన పాఠశాలలో, కుటుంబంలో అవగాహన పెంపొందించండి
 • మన వ్యాధి నిరోధక శక్తి ఎలా పనిచేస్తుంది? ఏ ఏ ఆహారాలు మన వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి? హెచ్ ఐ వి అంటే ఏమిటి? ఎయిడ్స్ అంటే ఏమిటి? ఎవరికైనా హెచ్ ఐ వి ఉందని తెలిస్తే ఏమవుతుంది? ఎవరైనా ఎయిడ్స్ బారిన పడితే ఏమవుతుంది? హెచ్ ఐ వి ఒకరినుంచి ఒకరికి ఏ విధంగా సంక్రమిస్తుంది? ఎలా సంక్రమించదు? మనం దానినుండి ఎలా కాపాడుకోగలం? హెచ్ ఐ వికి చికిత్స ఏమిటి? హెచ్ ఐ వి తల్లుల నుండి పిల్లలకు సంక్రమిచకుండా మందులు ఏ విధంగా కాపాడతాయి? ఏంటి రెట్రో వైరల్ థెరపీ (ART) ఎలా పనిచేస్తుంది? దానిని ఎప్పుడు వాడాలి? మన స్నేహాలు ఎప్పుడు మరియు ఎలా సంభోగానికి దారి తీస్తాయి? కండోమ్ ను సరిగా ఎలా ఉపయోగించాలి? (మగ/ ఆడా) హెచ్ ఐ వి బారిన పడిన మన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా ఉండటానికి అనుసరించాల్సిన పద్ధతులు ఏంటి? హెచ్ ఐ వి మరియు ఎయిడ్స్ లకు చికిత్సనందించే దగ్గరలోనున్న ఆరోగ్య కేంద్రం ఎక్కడుంది?

జీవనాధార ఆట, “ఫ్లీట్ ఆఫ్ హోప్” ఆట లేదా “నిజమా అబద్ధమా” ఆట నమూనాల కోసం లేదా మరియే ఇతర వివరాలకోసం www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి.

తెలుగు (Telugu) Home