పిల్లలు నేర్చుకోడానికి మరియు పంచుకోటానికి 100 ఆరోగ్య సందేశాలు, చాలా సింపుల్ గా, ఉపయోగపడే అవగాహన సందేశాలు. ఇవి 8-14 సంవత్సరాల మధ్య పిల్లలకోసం ఉద్దేశించబడినవి. అంటే ఇందులో టీనేజ్ కి రాబోతున్న 10-14 ఏళ్ల పిల్లలు కూడా ఉంటారు. మా ఉద్దేశంలో 10-14 సంవత్సరాల పిల్లలకి ఈ సమాచారం తెలియటం ఉపయోగకరం ఇంకా ముఖ్యం, ఎందుకంటే సాధారణంగా కుటుంబాలలో చిన్న చెల్లెళ్ళని, తమ్ముళ్ళని వీరే చూసుకుంటూ ఉంటారు. ఇంకా, వారు ఈ విధంగా కుటుంబానికి చేస్తున్న సాయానికి వారిని గుర్తించి మెచ్చుకోవటం ముఖ్యం.

ఈ 100 సందేశాలు 10 ముఖ్యమైన ఆరోగ్య టాపిక్ లకి ఒక్కోదాంట్లో 10 సందేశాలుగా ఇవ్వబడ్డాయి, ఆ ఆరోగ్య విషయాలు ; మలేరియా, డయేరియా, పోషణ, దగ్గు-జలుబులు మరియు జబ్బులు, పేగుల్లో పురుగులు, నీరు మరియు పరిశుభ్రత, హెచ్ ఐవి మరియు ఎయిడ్స్ ఇంకా ప్రమాదాలు,గాయాలు మరియు బాల్యంలో ఎదుగుదల. ఈ సింపుల్ ఆరోగ్య సందేశాలను తల్లిదండ్రులు,ఆరోగ్య కార్యకర్తలు ఇంట్లో, స్కూళ్ళల్లో,క్లబ్స్ లో మరియు క్లినిక్స్ లోని పిల్లలకోసం వాడాలి.

అంశం 6 : నీళ్లు మరియు పారిశుధ్యంమీద పది సూచికలు

  1. చేతులు శుభ్రంగా కడుగుకోవడానికి నీళ్లను, కొద్దిగా సబ్బును వాడండి. 10 సెకనుల పాటు చేతులు రుద్దుకోండి. చేతులను గాలిలో లేదా శుభ్రమైన కాగితం/ గుడ్డతో తుడుచుకోండి. మురికి గుడ్డతో తుడుచుకోవద్దు
  2. మీ ముఖం పైన టీ జోన్ (కళ్ళు, ముక్కు, నోరు) ను ముట్టుకొనే ముందు చేతులను శుభ్రంగా తుడుచుకోండి. అవకాశముంటే టీ జోన్ ముట్టుకోకుండా చూసుకోండి
  3. ఆహారం తయారు చేసేముందు, తినేముందు, పిల్లలకు పెట్టేముందు, మల మూత్ర విసర్జన చేసిన తరువాత, శిశువులకు స్నానం చేసే ముందు లేదా రోగగ్రస్తులకు సేవ చేసే ముందు చేతులను శుభ్రంగా కడుక్కోండి
  4. మీ శరీరం, బట్టలు శుభ్రంగా ఉంచుకోండి. మీ గోళ్లను, కాళీ వేళ్ళను, పళ్ళను, చెవులను, ముఖమును, కళ్ళను శుభ్రంగా ఉంచుకోండి. జోళ్ళు సూక్ష్మ జీవులనుండి రక్షణ కల్పిస్తాయి
  5. మనుషుల, పశువుల మల మూత్రాలమీద సూక్ష్మ క్రిములు చేరకుండా చూసుకోండి. మూత్రశాలలు ఉపయోగించి, చేతులు కడుగుకోండి
  6. మీ ముఖాన్ని శుభ్రంగా ఉంచుకోండి. ఉదయం, సాయంత్రం, అంటుకొని కళ్ళముందు ఈగలు తిరుగునపుడు మీ ముఖాన్నినీళ్లతోను, కొద్దిపాటి సబ్బుతోను కడుగుకోండి.
  7. శుభ్రమైన, సురక్షితమైన నీటిని అపరిశుభ్ర ,చేతులతోనూ, గిన్నెలతోనూ ముట్టుకోకండి. దానిని సూక్ష్మ క్రిములనుండి సురక్షితంగా ఉంచండి
  8. సూర్యకాంతి నీళ్లను సురక్షితంగా చేస్తుంది. సీసాలలో నీటిని తాగటానికి సురక్షితమైన వరకు ఒక 6 గంటలు అలా ఉంచండి
  9. కంచాలు, గిన్నెలు కడిగిన తర్వాత సూక్ష్మ క్రిములు నాశనమయ్యేట్టు సూర్యకాంతిలో అవకాశముంటే ఉంచండి
  10. మన సంఘాన్ని చెత్త నుండి దూరంగా ఉంచి ఈగలు, దోమలను తగ్గించండి . చెత్తను కాల్చడం లేదా కప్పడం చేసే వరకు ఒక చోటనే ఉంచండి

ఈ ఆరోగ్యపరమైన సందేశాలను ఆరోగ్యవిద్యానిపుణులు, వైద్యనిపుణులు పరిశీలించి ఆమోదించారు. వీటిని ఓఆర్ బి హెల్త్ వెబ్ సైట్ లో కూడా చూడవచ్చు. www.health-orb.org.

ఈ టాపిక్ మరింత అర్థం చేసుకోటానికి, ఇంకోళ్ళతో ఈ సందేశాలను పంచుకోవటానికి పిల్లలు చేయదగ్గ కొన్ని పనులకి ఆలోచనలు ఇక్కడ ఇవ్వబడ్డాయి.

నీళ్లు మరియు పారిశుధ్యం – పిల్లలు చేయగలిగినది ఏమిటి

  • మన మాతృ భాషలో, మన సొంత పదాలను ఉపయోగించి నీళ్లు మరియు పారిశుధ్యం పైన మన సొంత సందేశాలను తయారు చేయండి
  • ఆ సందేశాలు గుర్తుండేటట్లు వల్లె వేసుకోండి
  • ఆ సందేశాలను మన పిల్లలతోను కుటుంబ సభ్యులతోను పంచుకోండి
  • మన చేతులను ఏ రకంగా శుభ్రంగా వుంచుకోవాలో నేర్పునటువంటి ఒక పాటను నేర్చుకోండి
  • శుభ్రమైన కుటుంబం క్రిముల కుటుంబం వుండే ఊరి లోకి వచ్చినపుడు క్రిముల కుటుంబానికి ఏమవుతుందో తెలిపే నాటికగాని లేదా క్రిములు ఎక్కడ దాక్కుంటాయో తెలిపే నాటిక గాని ఒకటి తయారు చేసి మరియు ఆడి చూపండి
  • మన తమ్ముళ్లు మరియు చెల్లెళ్లు చేతులు శుభ్రంగా ఎలాగ కడుక్కోవాలో తెలుసుకొనేటట్లు వారికి సహాయ పడండి
  • ఒక గుంపులో వున్న మనుషులు ఒక గంటలో ఎన్ని సార్లు వారు తమ తమ ముఖాలను, దుస్తులను, ఇతరులను ముట్టుకుంటున్నారో గమనిస్తూ, ఆ వివరాలను ముద్రితం చేయండి
  • క్రిములు చేతి నుండి శరీరం లోకి విస్తరించే మార్గాలన్నిటి గురుంచి ఆలోచించండి
  • పాఠశాలలోని మూత్రశాలలు శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
  • వడపోత ద్వారా నీటిని శుభ్రపరచడం నేర్చుకోండి
  • పాఠశాల పరిసరాలు చెత్తలేకుండా శుభ్రంగా ఉండేటట్లు ఒక ప్రణాళిక రచించండి
  • పాఠశాల్లో ఒక ఆరోగ్య సంఘాన్ని స్థాపించండి
  • క్రిములు, ఈగలు, మురికి ల గురించి మనకు తెలిసినదంతా మన కుటుంబాలతో పంచుకోండి
  • నీటి కుండను ఎల్లప్పుడూ శుభ్రంగా మరియు మూత పెట్టి ఉంచండి. ఎల్లప్పుడూ గరిట వాడండి. చేతిని వాడకండి. మన తమ్ముళ్లకు, చెల్లెళ్లకు కుండా నుండి నీటిని ఎలా తీయాలో చేసి చూపండి
  • టిప్పి ట్యాప్ ను అందరు కలసి తయారు చేయండి
  • సబ్బును పట్టి ఉంచడానికి వాష్ మిట్ ను ఎలా తయారు చేయాలో తెలుసుకోండి
  • కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛును ప్లాస్టిక్ సీసా మరియు కొంత పంచదార నీటితో తయారు చేయండి
  • సూర్యకాంతి ని ఉపయోగించి ఇంటిలో తాగే మంచి నీటిని తయారు చేయడంలో సహాయపడండి
  • ఇసుక వడపోతను ఉపయోగించి మురికి నీటిని శుభ్రం చేయండి
  • తడి వంట పాత్రలు, పళ్ళాలు ఎండలో పొడి అయ్యేందుకు వీలుగా అరలను తయారు చేయండి
  • మన చేతులను క్రిములనుండి శుభ్రంగా ఎలా వుంచగలమో అడగండి. మన ఇంటిలో చేతులు కడుగుకోవడానికి సబ్బు వుందా? స్థానిక దుకాణంలో సబ్బు ధర ఎంత? మన శరీరాలను శుభ్రంగా ఎలా ఉంచుతాం? మన పళ్ళను ఎలా శుభ్రం చేసుకుంటాం? క్రిములు ఎక్కడనుండి వస్తాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా వ్యాపిస్తాయి? కీటకాలు ఏమి తింటాయి, ఎలా బతుకుతాయి, ఎలా అభివృద్ధి చెందుతాయి? కీటకాలు తమ కాళ్ళ ద్వారా ఎలా మురికి వ్యాపింపచేస్తాయి? మన నీటి వనరులు ఏవి? మురికి నీటిని ఏ విధంగా తాగడానికి అనుకూలంగా మార్చవచ్చు? ప్లాస్టిక్ సీసాలు ఎక్కడ దొరుకుతాయి? ఎలాంటి గుడ్డను నీటి వడపోతకు ఉపయోగించొచ్చు? వంట తయారు చేయునప్పుడు కుటుంబ సభ్యులు ఎలాంటి ఆరోగ్యకరమైన పద్ధతులు అనుసరిస్తారు? ఇంటిలో లేదా మన ప్రాంతంలో ఏ ఏ ప్రదేశాలు కీటకాలు ఎక్కువగా ఉండటానికి అనువైనవి?

కీటకాలను పట్టి ఉంచే ఉచ్ఛు, సూర్యకాంతి తో నీటిని శుభ్రపరచు విధానం, ఇసుక వడపోత తయారు చేయు విధానం, వాష్ మిట్ మరియు టిప్పి ట్యాప్ తయారు చేసే విధానం మొదలగు వాటి గురుంచి మరింత సమాచారం కొరకు www.childrenforhealth.org లేదా clare@childrenforhealth.org ను సంప్రదించండి

తెలుగు (Telugu) Home